AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: హనుమాన్ మాలలో వరుణ్ తేజ్.. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలే మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ పాన్ ఇండియా మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్న వరుణ్ తాజాగా హనుమాన్ మాలలో దర్శనమిచ్చాడు.

Varun Tej: హనుమాన్ మాలలో వరుణ్ తేజ్.. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో
Varun Tej
Basha Shek
|

Updated on: Dec 03, 2024 | 4:01 PM

Share

మెగా ఫ్యామిలీకి దేవుడిపై విశ్వాసమెక్కువ. భక్తి కార్యక్రమాలకు బాగా ప్రాధాన్యమిస్తారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెగ్యులర్ గా అయ్యప్ప మాల ధరిస్తారు. ఇక డిప్యూటీ సీఎం పవర్ స్టార్ కూడా గతంలో పలు సార్లు మాల ధరించారు. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హనుమాన్ మాలను వేసుకున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం (డిసెంబర్ 03) జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న వరుణ్‌ తేజ్‌కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వరుణ్ కు స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే కొండగట్టు ఆలయ ప్రాముఖ్యతను అంతరాలయ విగ్రహ విశిష్టతను వరుణ్ తేజ్ కు వివరించారు. దర్శనానంతరం మాట్లాడిన వరుణ్ తేజ్ కొండగట్టు అంజన్న చాలా పవర్ ఫుల్ దేవుడన్నారు. మొదటి సారి హనుమాన్ దీక్ష తీసుకున్నా.. అంజన్నను దర్శించుకోవడం  అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

వరుణ్ తేజ్‌ తేజ్ నటించిన మట్కా సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. పలాస 1978 ఫేం డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. . తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే వరుణ్ తేజ్ నటనకు ప్రశంసలు లభించాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా డిసెంబ‌ర్ 05 నుంచి తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కు రానుంది.

కొండగట్టు  అంజన్న ఆలయంలో వరుణ్ తేజ్..

వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ లో మట్కా స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి