- Telugu News Photo Gallery Cinema photos Tollywood Crazy Hero to act as villain in Allu Arjun Pushpa 3 movie
Pushpa 3: ఇదేం మాస్ రా మావా! పుష్ప 3లో విలన్‌గా ఆ టాలీవుడ్ క్రేజీ హీరో! ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా
2022లోనే టాలీవుడ్ ప్రముఖ హీరో సుకుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పుష్ప 3గురించి అప్డేట్ ఇచ్చాడు. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, పుష్ప ది ర్యాంపేజ్ అని రాసుకొచ్చాడు. పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో ఇప్పుడు ఆ ట్వీట్ మళ్లీ వైరల్ అవుతోంది
Updated on: Dec 03, 2024 | 9:28 PM

అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 05న విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

అంతా బానే ఉన్నా.. కొన్ని ప్రశ్నలు మాత్రం అభిమానులను వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేసారు సుకుమార్. ట్రైలర్‌లో వచ్చిన కొన్ని షాట్స్ సినిమాలో కనిపించలేదు. జపాన్‌లో కొందరితో బిజినెస్ డీల్స్ చేస్తాడు పుష్ప.. అలాగే అక్కడ మరికొన్ని సీన్స్ కూడా ఉంటాయి.

అవేవీ పార్ట్ 2లో కనిపించలేదు. దాంతో పాటు పుష్పపై జాలిరెడ్డి గన్ ఎక్కుపెట్టిన సీన్ సైతం సినిమాలో లేదు. అదొక్కటే కాదు.. జపాన్ ఎపిసోడ్ సైతం సడన్‌గా కట్ చేసారు సుక్కు. రెండేళ్ళ కింద రిలీజ్ చేసిన Where Is Pushpa టీజర్‌లోని ఒక్క షాట్ కూడా పుష్ప 2 రూల్‌లో లేదు.

తన సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం, వాటికి పవర్ ఫుల్ నటీనటులను ఎంచుకోవడం దర్శకుడు సుకుమార్ స్టయిల్.

ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేసారు లెక్కల మాస్టారు. వీటన్నింటికీ ఒకేసారి పార్ట్ 3లో ఆన్సర్ ఇవ్వబోతున్నారు సుకుమార్. నెక్ట్స్ రామ్ చరణ్‌తో సినిమా కమిటైన సుక్కు.. పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడు మొదలుపెడతారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.





























