Bhool Bhulaiyaa 3: రికార్డ్ వసూళ్లను సాధిస్తున్న బూల్ బులయ్యా 3
ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ భూల బులయ్యా 2. ఈ సినిమాతో హీరో కార్తిక్ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్‌గా మారిపోయారు. భూల్ బులయ్యా కాన్సెప్ట్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఈ ఫ్రాంచైజీలో త్రీక్వెల్‌ను సిద్ధం చేశారు మేకర్స్. త్రీక్వెల్‌తో హిస్టారిక్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్నారు కార్తీక్.
Updated on: Dec 03, 2024 | 9:13 PM

ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ భూల బులయ్యా 2. ఈ సినిమాతో హీరో కార్తిక్ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్‌గా మారిపోయారు. భూల్ బులయ్యా కాన్సెప్ట్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఈ ఫ్రాంచైజీలో త్రీక్వెల్‌ను సిద్ధం చేశారు మేకర్స్. త్రీక్వెల్‌తో హిస్టారిక్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్నారు కార్తీక్.

సౌత్‌లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాను నార్త్‌లో భూల్ బులయ్యా పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో అదే కాన్సెప్ట్‌ను కొనసాగిస్తూ భూల్ బులయ్యా 2 రూపొందించారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన సీక్వెల్ కూడా సూపర్ హిట్ కావటంతో పార్ట్ 3 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సీక్వెల్‌కు భారీ హైప్ రావటంతో పార్ట్ 3ని వెంటనే పట్టాలెక్కించారు మేకర్స్. త్రీక్వెల్ కోసం మేకర్స్ ఎంచుకున్న కథ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో తొలి రెండు భాగాలను మించి సక్సెస్ అయ్యింది భూల్ బులయ్యా 3. వసూళ్ల పరంగానూ కార్తిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ నెంబర్స్‌ను రికార్డ్ చేసింది.

నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన భూల్ బులయ్యా 3, 25 రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్‌లో భారీ రిలీజ్ లేవి లేకపోవటంతో ఈ రికార్డ్ సాధ్యమైందంటున్నారు విశ్లేషకులు. దీంతో ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న టైమ్‌లో ఆదుకునే సత్తా ఉన్న సేవియర్‌గా మరోసారి ప్రూవ్ చేసుకున్నారు కార్తీక్.

భూల్ బులయ్య 3 కూడా బిగ్ హిట్ కావటంతో ఆల్రెడీ ఫోర్త్ ఇన్‌స్టాల్మెంట్‌కు సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు మేకర్స్. త్వరలోనే కథను సిద్ధం చేసి కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ సిరీస్‌లో మరో మూవీకి రెడీ అవుతున్నారు కార్తీక్ ఆర్యన్.