- Telugu News Photo Gallery Cinema photos Allari Naresh and Vennela Kishore are ready to greet the audience with two variety movies
Movie Updates: అల్లరి అండ్ వెన్నెల.. రెండు వెరైటీ మూవీస్‌తో సిద్ధం..
డిసెంబర్ ఎండింగ్‌లో ఇద్దరు ఇంట్రస్టింగ్ ఆర్టిస్టులు, రెండు వెరైటీ మూవీస్‌తో ప్రేక్షకులను పలకరించడానికి మేం రెడీ అంటున్నారు. వారిలో ఒకరు అల్లరి నరేష్.. ఇంకొకరు వెన్నెల కిశోర్. బచ్చలమల్లితో నరేష్ రెడీ అయితే, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో కిశోర్ సిద్ధమవుతున్నారు...
Updated on: Dec 04, 2024 | 8:35 AM

బచ్చల మల్లి టీజర్ చూశారా? ఎలా ఉంది... ఇప్పుడు ఇదే డిస్కషన్. 1990 నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కించారు బచ్చల మల్లి మూవీని. మాస్ లుక్‌లో, మరీ మాస్‌గా కనిపిస్తున్నారు అల్లరి నరేష్. అమృత అయ్యర్ ఇందులో హీరోయిన్.

నేను ఎవరి కోసం మారనూ, నాకు నచ్చినట్టే నేనుంటా అనే బచ్చల మల్లి జీవితంలో అసలేం జరిగింది? అతనికీ, అతని తండ్రికీ గొడవేంటి అనే ఆసక్తి క్రియేట్ చేసింది టీజర్. ఇది అందరిని ఆకట్టుకుంది.

ఎన్నాళ్లుగానో హిట్ కోసం వెయిట్ చేస్తున్న నరేష్‌కి బచ్చల మల్లి కోరుకున్న హిట్‌ని ఇస్తుందా? 2024 మెమరబుల్ ఇయర్‌గా మారుతుందా? అనేది తెలియాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాలి.

నరేష్ రిజల్ట్ తెలిసిన ఐదు రోజులకు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో పలకరించడానికి రెడీ అవుతున్నారు వెన్నెల కిశోర్. వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల కీ రోల్స్ చేసిన సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చంటబ్బాయ్ తాలూకా అనేది ట్యాగ్‌లైన్.

ఈ మూవీలో వెన్నెల కిశోర్ డిటెక్టివ్ రోల్‌లో నటించారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. షెర్లాక్ హోమ్స్ క్లిక్ అయితే వెన్నెల కిశోర్ హీరోగానే కంటిన్యూ అవుతారా? లేకుంటే కేరక్టర్లు కూడా చేస్తారా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదో ఇంట్రస్టింగ్ డిస్కషన్.




