Rajamouli: జక్కన్న గర్వంగా కలిసి నడుస్తారా.? అందనంత దూరంలో నిలబడుతారా.?
ఎప్పుడూ మనమే టాప్.. మనదే పై చేయి అనుకుంటే ఎలా? కొన్నిసార్లు చుట్టుపక్కల కూడా చూస్తూ ఉండాలి. ఎవరు మన దగ్గర్లో ఉన్నారు.. ఎవరు దాటి పోవాలనుకుంటున్నారు? అన్న విషయం మీద ఫోకస్ చేస్తుండాలి. మిగిలిన వాళ్ల సంగతేమోగానీ, ఇప్పుడు జక్కన్న ఈ మాటలను కాస్త జాగ్రత్తగా వినాలి... ఎందుకంటారా? డిస్కస్ చేసుకుందాం పదండి...
Updated on: Dec 04, 2024 | 9:00 AM

ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి అంటే పేరు కాదు... ఇండియన్ సినిమా బ్రాండ్. గ్లోబల్ రేంజ్‌లో ఆయన సంపాదించుకున్న క్రేజ్ అది. అలాంటి క్రేజ్‌ని ఇంకొకరు టచ్ చేయడానికి రెడీ అవుతుంటే ఎలా ఉంటుంది... మన వాళ్లే కదా.. అని అనుకోవాలా.. లేకుంటే.. అమ్మో ఒక్కడుగు ముందుకేయాలని జాగ్రత్తపడాలా? అందులోనూ తనకెంతో ఇష్టమైన సుకుమార్ తన రేంజ్‌కి ఎదుగుతారనే ప్రచారం పీక్స్‌లో ఉన్నప్పుడు రాజమౌళి మానసిక స్థితి ఏంటి?

ఇప్పుడు సుకుమార్ మాత్రమే కాదు.. అప్పుడెప్పుడో ప్రశాంత్ నీల్ కూడా జక్కన్నకు పోటీగా మారుతారనే టాక్‌ని సొంతం చేసుకున్నారు. గతంలో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 1250 కోట్లు వసూళ్లు చేసింది. అలాగే గత ఏడాది డిసెంబర్ లో సలార్ 715 కోట్ల వసూళ్లు చేసింది.

ఈ మధ్య కల్కితో నాగ్ అశ్విన్ కూడా గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేశారు. 2024లో బిగ్గెస్ట్ బ్లక్ బస్టర్ అయినా ఈ సినిమా 1200 కోట్లు వసూళ్ల చేసింది. దీంతో ప్రభాస్ ఖాతాలో రెండో 1000 కోట్ల మూవీగా నిలిచింది.

అటు సందీప్ రెడ్డి వంగా 'నేనింతే... నేను చేసే సినిమాలు ఇంతే' అంటూ యూత్‌ని టార్గెట్ చేసి మరీ పెద్ద పెద్ద విజయాలు అందుకుంటున్నారు. వీరిలో ఎవరు కాస్త బిగ్ నెంబర్స్ చూసినా... రాజమౌళి దరిదాపుల్లోకి చేరడం చాలా తేలిక.

మరి వీళ్లందరూ మా వాళ్లని జక్కన్న గర్వంగా కలిసి నడుస్తారా? లేకుంటే, తనదైన స్ట్రాటజీతో ఎవరికీ అందనంత దూరంలో నిలబడుతారా? విషయం ఏదైనా ఎస్ఎస్ఎంబీ29 రిజల్ట్, అది క్రియేట్ చేసే రికార్డులు.. రెండూ రాజమౌళికి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే పారా హుషార్ జక్కన్నా.. అనే మాట పదే పదే వినిపిస్తోంది.





























