Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Jhansi: సినిమాల్లోకి యాంకర్ ఝాన్సీ కూతురు.. ఛార్మింగ్ లుక్స్‌తో అదరగొట్టేస్తోందిగా..

యాంకర్ ఝాన్సీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన మాటల ప్రవాహంతో ఎన్నో టీవీషోస్‌లను సక్సెస్‌ ఫుల్‌గా రన్ చేసిన ఆమె వెండితెరపైనా సత్తా చాటారు. ఇప్పటికీ సీనియర్ నటిగా సహాయక పాత్రలతో మెప్పిస్తున్నారు.

Anchor Jhansi: సినిమాల్లోకి యాంకర్ ఝాన్సీ కూతురు.. ఛార్మింగ్ లుక్స్‌తో అదరగొట్టేస్తోందిగా..
Anchor Jhansi Daughter Dhanya
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2024 | 8:53 PM

యాంకర్‌గా, నటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీ. బుల్లితెరపై పలు టీవీషోలకు యాంకర్ గా వ్యవహరించిన ఆమె స్టార్ హీరోల సినిమాల్లోనూ సహాయక నటిగా మెప్పించారు. 1994 నుంచి మొదలైన ఆమె సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలోలా బుల్లితెరపై ఎక్కువగా కనిపించనప్పటికీ సినిమాల్లో మాత్రం తరచూ కనిపిస్తున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోనూ కీలక బాధ్యతలు చూసుకుంటున్నారు ఝాన్సీ. అయితే ఈ విషయాలన్నీ దాదాపు అందరికీ తెలిసినవే. అయితే ఝాన్సీకి 22 ఏళ్ల కూతురు ఉందన్న విషయం పెద్దగా ఎవరికీ తెలీదు. బయట కూడా ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలేదామె. అయితే కొన్ని రోజుల క్రితం తన గారాల పట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు ఝాన్సీ. అప్పుడే తన కూతురు ధన్యను అందరికీ పరిచయం చేసింది. అంతే ఒక్కసారిగా ధన్య ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిపోయాయి. ఝాన్సీ లాగే ధన్య కూడా సినిమాల్లోకి వస్తుందా? రాదా? అని నెటిజన్లు చర్చించుకున్నారు. అయితే ఈ సందేహాలు, అనుమానాల్లోకి తెర దించుతూ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది ధన్య. ఇందులో భాగంగానే ఇటీవల తన తల్లితో కలిసి ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.

ఇక ధన్య చూడడానికి ఎంతో క్యూట్ గా, అందంగా ఉంటుంది. ఒక హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆమెలో ఉన్నాయి. ఇక ధన్య ఇన్ స్టాగ్రామ్ ఖాతాను పరిశీలిస్తే ఆమె మంచి డ్యాన్సర్ అని తెలుస్తోంది. తన బయోలో కూడా అదే ఉంది. అందులో తను ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేసిన పలు వీడియోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చదువుకుంటోన్న ధన్య సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తోంది. అందుకు ఝాన్సీ కూడా ఆమెకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లీ కూతుళ్లు కలిసి ఒక టాక్ షోకు వచ్చారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న కాకమ్మ కథలు అనే షోలో సందడి చేశారు. ఈ షో హోస్ట్ తేజస్వి మదివాడ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలిచ్చారు.

ధన్య ఎనర్జిటిక్ డ్యాన్స్ ఇదిగో..

View this post on Instagram

A post shared by Dhanya (@dhanya.lokarapu)

ఆహా టాక్ షోలో తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది ధన్య. తనకు 22 ఏళ్లు అని, హైట్  5’9 అని చెప్పింది. అలాగే న్యాచురల్ స్టార్ నాని తన ఫేవరెట్ హీరో అని, మణిరత్నం సినిమాలో నటించాలని ఉందని తన మనసులోని మాటలను బయట పెట్టింది. అలాగే తల్లితో తనకున్న అనుబంధం, చిన్నతనం నుంచి తను పెరిగిన విధానం గురించి ఓపెన్ గా మాట్లాడింది ధన్య. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ ఇండస్ట్రీలోకి వస్తోన్న ధన్యకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఆహా టాక్ షోలో కూతురు ధన్యతో ఝాన్సీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.