Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. స్పందించిన పుష్ప 2 నిర్మాతలు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే విడుదల కంటే ముందే కొన్నిచోట్ల రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ క్రమంలోనే రాత్రి సంధ్య థియేటర్ల అపశ్రుతి చోటు చేసుకుంది.

Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. స్పందించిన పుష్ప 2 నిర్మాతలు..
Pushpa 2 Makers
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 05, 2024 | 3:58 PM

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప 2. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అంతకు ముందు రోజు రాత్రి కొన్నిచోట్ల ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి అభిమానులతోపాటే సినిమా చూడాలని నిన్న రాత్రి సంధ్య థియేటర్ కు వచ్చారు. బన్నీ వస్తున్నాడని తెలియడంతో సంధ్య థియేటర్ కు అభిమానులు పోటెత్తారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో అక్కడ పరిస్థితి అదుపుతప్పింది. భారీగా వచ్చిన బన్నీ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. వారిపై లాఠీ ఛార్జ్ కూడా చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ స్పృహతప్పి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ టీం సదరు మహిళ కుటుంబాన్ని పరామర్శించింది. తాజాగా ఈ ఘటనపై పుష్ప 2 మూవీ నిర్మాతలు స్పందించారు. సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు.

“నిన్న రాత్రి జరిగిన సంఘటన మాకు చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీకి, చికిత్స తీసుకుంటున్న ఆ అబ్బాయి కోసం మేము ప్రార్దనలు చేస్తాం. అలాగే ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి మేము అండగా నిలబడతాము” అంటూ పోస్ట్ చేశారు. దిల్ సుఖ్ నగర్‌లో నివాసముండే రేవతి.. భాస్కర్. వీళ్లిద్దరూ భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇందులో వీళ్ల అబ్బాయి శ్రీతేజకు అల్లు అర్జున్ అంటే మహా ఇష్టం. పుష్ప సినిమాకు పెద్ద అభిమాని. దీంతో పుష్ప2 సినిమాను మొదటి రోజు చూపించేందుకు భాస్కర్ తన కుంటుంబాన్ని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గరకు తీసుకొచ్చాడు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC