- Telugu News Entertainment Tollywood Know This Actress Have Private Jet and 190 Crores Net Worth, She Is Nayanthara
Tollywood: మేడమ్ సర్ మేడమ్ అంతే.. రూ.190 కోట్ల ఆస్తులు.. తల్లైనా తగ్గని క్రేజ్.. ఎవరంటే..
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. వైవిధ్యమైన పాత్రలతో..తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Dec 05, 2024 | 3:26 PM

అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. లేడీ సూపర్ స్టార్ నయనతార. 2003లో మనసునక్కరే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన నయన్.. ఆ తర్వాత సూర్య నటించిన గజిని సినిమా ద్వారా ఫేమస్ అయ్యింది.

తెలుగు, తమిళంలో వరుస విజయాలను అందుకుంటూ అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలిచింది నయన్. ప్రేమ, బ్రేకప్, పెళ్లి వార్తలు నిత్యం చక్కర్లు కొట్టాయి.

గతంలో శింబు, ప్రభుదేవాతో ప్రేమ, బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి సరోగసి ద్వారా ఇద్దరు ట్విన్స్ జన్మించారు. ప్రస్తుతం నయన్ ఆస్తులు రూ.190 కోట్లు అని సమాచారం.

అలాగే ఆమెకు హైదరాబాద్ లో రెండు ప్రీమియం అపార్ట్మెంట్స్ ఉన్నాయట. వీటి విలువ దాదాపు రూ.15 కోట్లకు పైగానే ఉంటుంది. కేరళలో ఆమెకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఉంది. ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటుంది. ఆమెకు ప్రైవేట్ జెట్ సైతం ఉంది.




