K S Ravikumar: ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఇంట తీవ్ర విషాదం.. తల్లి కన్నుమూతతో
ప్రముఖ దర్శకుడు, నిర్మాత , నటుడు కేఎస్ రవికుమార్ ఇంట తీవ్ర విషాదం చోటుకుంది. ఆయన తల్లి రుక్మిణి అమ్మాళ్ గురువారం (డిసెంబర్ 05)న కన్నుమూశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కేఎస్ రవికుమార్ తల్లికి నివాళులు అర్పిస్తున్నారు.
కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ నటుడు కేఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి అమ్మాళ్ (88 ) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలకు తోడు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కే ఎస్ రవికుమార్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం రుక్మిణీ భౌతిక కాయాన్ని చెన్నైలోని చిన్నమలై ప్రాంతంలోని దర్శకుడు కేఎస్ రవికుమార్ నివాసంలో ఉంచారు. గురువారం మధ్యాహ్నం 2:30గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. రుక్మిణి అమ్మాళ్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే కేఎస్ రవికుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
కాగా కేఎస్ రవికుమార్ కు కోలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. 1990లో వచ్చిన ‘పురియాద పూజ’ తమిళ్ సినిమాతో తన ప్రయాణాన్ని ఆరంభించిన ఆయన రజనీకాంత్, కమల్, శరత్‌కుమార్, చిరంజీవి, నాగర్జున, బాలకృష్ణ, సూర్య తదితర స్టార్ హీరోలతో కలిసి సినిమాలు తెరకెక్కించాడు. బావ నచ్చాడు, స్నేహం కోసం విలన్, జై సింహా, రూలర్ వంటి తెలుగు స్ట్రెయిట్ సినిమాలను కూడా తెరకెక్కించారు. ఇక నిర్మాతగానూ, నటుడిగానూ తన అభిరుచిని చాటుకున్నారు.
కేఎస్ రవికుమార్ ట్వీట్..
— K.S.Ravikumar (@ksravikumardir) December 5, 2024
కమర్షియల్ సినిమాలతో ఫేమస్..
రజనీకాంత్ నరసింహ, చిరంజీవి తో స్నేహం కోసం, కమల్ హాసన్ తో తెనాలి, దశావతారం సినిమాలు కేఎస్ రవికుమార్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ముఖ్యంగా దశావతారం సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన ఫ్యామిలీ గురించి మన తెలుగు వాళ్లు చాలా మందికి తెలియకపోవచ్చు. కె.ఎస్. రవికుమార్‌కు మొత్తం ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే వారందరూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
విజయ్ దళపతిలో కే ఎస్ రవికుమార్..
View this post on Instagram
కూతురితో కేఎస్ రవికుమార్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..