Samantha: వైరలవుతున్న సమంత లేటేస్ట్ పోస్ట్.. ఇంతకీ ఏమని చేసిందంటే..
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే సిటాడెల్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా నటించిన ఈ సిరీస్ ను హిందీలో రీమేక్ చేయగా.. సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
టాలీవుడ్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది సామ్. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించగా.. ఈ సిరీస్ లో తల్లి పాత్రలో కనిపించింది సామ్. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా నెట్టింట సామ్ షేర్ చేసిన పోస్టులు క్షణాల్లో వైరలవుతున్నాయి. ఇక ఇప్పుడు కూడా సమంత పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తన వదిన నికోల్ జోసఫ్ (సోదరుడు డేవిడ్ భార్య) పెట్టిన పోస్టును తన ఇన్ స్టా స్టోరీలో రీషేర్ చేసింది సామ్.
అందులో ఏముందంటే.. ‘ప్రపంచంలో మంచి వదినలు కూడా ఉటారు. మా వదినను నేను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను’ అని నికోల్ పోస్ట్ పెట్టగా.. దానిని షేర్ చేస్తూ లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చింది సామ్. ఈ ఏడాది సెప్టెంబరులోనే సమంత సోదరుడి వివాహం జరిగింది. అమెరికాలో జరిగిన ఆ వివాహ వేడుకలో సామ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేశారు సామ్.
ఇదిలా ఉంటే.. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో సిటాడెల్ టీంతో దిగిన ఫోటోను షేర్ చేసింది సామ్. ఇంత గొప్ప టీంతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతి అని రాసుకొచ్చారు. సిటడెల్ హనీ బన్నీ కోసం రాజ్ అండ్ డీకేతో వర్క్ చేయడం గర్వంగా ఉంది అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి. అటు సిటాడెల్ సిరీస్ విజయాన్ని అందుకుంది. కానీ ఆ వెంటనే సామ్ తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.