AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty : అయ్యా బాబోయ్.. రిషబ్ శెట్టి మూవీ లైనప్ చూస్తే షాకే.. ఎన్ని సినిమాలంటే..

ఒకే ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్నాడు హీరో రిషబ్ శెట్టి. ఇన్నాళ్లు దర్శకుడిగా హిట్ చిత్రాలు తెరకెక్కించిన రిషబ్ శెట్టి.. ఇప్పుడు హీరోగా వెండితెరపై సంచలనం సృష్టిస్తున్నారు. ఈ కన్నడ స్టార్ హీరో చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ తెలిస్తే షాకవుతారు.

Rishab Shetty : అయ్యా బాబోయ్.. రిషబ్ శెట్టి మూవీ లైనప్ చూస్తే షాకే.. ఎన్ని సినిమాలంటే..
Rishabh Shetty
Rajitha Chanti
|

Updated on: Dec 05, 2024 | 2:39 PM

Share

కాంతార సినిమాతో పాన్ ఇండియా సినీప్రియులకు దగ్గరయ్యాడు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో దర్శకుడిగానే గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి.. ఇప్పుడు కాంతార సినిమాతో హీరోగా మెప్పించారు. కన్నడలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన రిషబ్ శెట్టి.. తర్వాత హీరోగానూ అదే స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ సినిమా విజయం తర్వాత దానికి ప్రీక్వెల్ గా కాంతార వన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అదికారిక ప్రకటన సైతం వచ్చింది. ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబర్ 2న విడుదల కానుంది.

ఇదే కాకుండా హీరోగా రిషబ్ శెట్టికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే కాంతార ప్రీక్వెల్ తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న రిషబ్ శెట్టి.. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నారు.ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. ఇందులో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమానే కాకుండా డైరెక్టర్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారట.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారట.

ఇవే కాకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 2027 జనవరి 1న రిలీజ్ చేయనున్నారు. వీటితోపాటు త్వరలోనే కాంతార 3 అప్డేట్ కూడా రానుందని సమాచారం. ప్రస్తుతం రిషభ్ శెట్టి చేతిలో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. అటు దర్శకుడిగా.. ఇటు హీరోగా సినీరంగంలో సంచలనం సృష్టిస్తున్నాడు రిషబ్ శెట్టి.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి