Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ ఓటింగ్‏లో మారిన లెక్కలు.. బిగ్‏బాస్ ఫైనలిస్టులకు ఊహించని రిజల్ట్..

బిగ్‏బాస్ చివరి వారం ఓటింగ్ లెక్కల్లో భారీగానే తేడాలు కనిపిస్తున్నాయి. ఈసారి టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్ ఇద్దరి మధ్య హోరా హోరీ పోరు నడుస్తుంది. మొదటి రోజు గౌతమ్ కంటే నిఖిల్ స్వల్ప ఓటింగ్ తేడాతో కనిపించాడు. ఇక రెండో రోజు మధ్య ఇద్దరి ఓటింగ్ లో తేడా వచ్చింది.

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ ఓటింగ్‏లో మారిన లెక్కలు.. బిగ్‏బాస్ ఫైనలిస్టులకు ఊహించని రిజల్ట్..
Bigg Boss 8 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 11, 2024 | 7:10 AM

బిగ్‏బాస్ సీజన్ 8 చివరి దశకు చేరింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సీజన్ ముగియనుంది. దీంతో ఇప్పుడు ఈ సారి విన్నర్ ఎవరు కాబోతున్నారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 15న బిగ్‏బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ నిర్వహించి విజేతను ప్రకటించనున్నారు. ఇప్పటికే సోమవారం నుంచి బిగ్‏బాస్ చివరి వారం ఓటింగ్ సైతం ప్రారంభమైంది. అయితే ఈ లాస్ట్ వీక్ లో ఓటింగ్ ఊహించని ఫలితాలు చేటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకీ ఓటింగ్ లెక్కలు మారిపోతున్నాయి. దీంతో అటు టాప్ 5 ఫైనలిస్ట్ స్థానాల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం టాప్ 5లో గౌతమ్, ప్రేరణ, నిఖిల్, నబీల్, అవినాష్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇందులో గౌతమ్, నిఖిల్ మధ్య రసవత్తమైన పోరు నడుస్తుంది.

బిగ్‏బాస్ మొదటి రోజు ఓటింగ్ చూస్తే గౌతమ్, నిఖిల్ మధ్య స్వల్ప తేడా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇద్దరిలో మొదటి రోజు స్వల్ప ఓటింగ్ తేడాతో గౌతమ్ నిఖిల్ కంటే ముందు స్థానంలో ఉన్నాడు. ఇక మరికొన్ని ఓటింగ్ పోల్స్ లో నిఖిల్ టాప్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య స్పల్ప ఓటింగ్ తేడాతో హోరా హోరీ పోటీ సాగుతుంది. మొదటి రోజు గౌతమ్ కంటే నిఖిల్ టాప్ లో ఉన్నట్లు కనిపించింది. కానీ రెండో రోజు ఓటింగ్ లెక్కలు ఒక్కసారిగా మారాయి. అనుహ్యంగా నిఖిల్ ను దాటేసి గౌతమ్ టాప్ ప్లేస్ లోకి చేరుకున్నాడు. దీంతో ఇప్పుడు బిగ్‏బాస్ ఓటింగ్ లెక్కలు మరింత ఆసక్తికరంగా మారాయి.

ఇక వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో నబీల్, నాలుగో స్థానంలో ప్రేరణ, ఐదో స్థానంలో అవినాష్ ఉన్నట్లు ఓటింగ్ పోల్స్ చేస్తే తెలుస్తోంది. ప్రస్తుతం అనధికారిక సైట్లలో వందశాతం ఓటింగ్ జరగ్గా.. దాదాపు 80 శాతం ఓటింగ్ తో గౌతమ్, నిఖిల్ ఇద్దరూ పోటీగా దూసుకుపోతున్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.