Bigg Boss 8 Telugu: ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పిన గౌతమ్, నిఖిల్.. ఇద్దరికీ అప్పుడే బ్రేకప్..

బిగ్‏బాస్ సీజన్ 8 ఇంకా మరికొన్ని రోజుల్లో శుభం కార్డ్ పడనుంది. ఇప్పటికే ఈ షో స్టార్ట్ అయ్యి 100 రోజులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఫినాలే వీక్ నడుస్తోంది. హౌస్ లో గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ టాప్ 5 కంటెస్టెంట్స్ మిగిలారు. దీంతో అటు తమకు నచ్చిన కంటెస్టెంట్ ను విన్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఫ్యాన్స్.

Bigg Boss 8 Telugu: ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పిన గౌతమ్, నిఖిల్.. ఇద్దరికీ అప్పుడే బ్రేకప్..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 11, 2024 | 10:22 AM

బిగ్‏బాస్ సీజన్ 8లో చివరి వారం ఓటింగ్ నడుస్తుంది. డిసెంబర్ 15న ఈ షో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్లను అలరించడానికి అటు సీరియల్ బ్యాచ్ మొత్తం బిగ్‏బాస్ షోలో సందడి చేస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో మామగారు సీరియల్ నుంచి ఆకర్ష్, సుహాసిని ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరు నిఖిల్, అవినాష్ లకు మంచి ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత హౌస్మేట్స్ అందరి ఫస్ట్ లవ్, బ్రేకప్ స్టోరీలు చెప్పాలంటూ కోరారు. ముందుగా గౌతమ్ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చాడు. కాలేజీలో ఉన్నప్పుడే తనకు ఫస్ట్ మేజర్ రిలేషన్ షిప్ నడిచిందని చెప్పుకొచ్చాడు. చాలా సీరియల్ రిలేషన్ షిప్ లో ఉండి.. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాడట. తనంటే ఎంతో ఇష్టం.. ఎంతో ప్రేమ ఉండేదని.. కానీ చాలా రీజన్స్ వల్ల అది జరగలేదని.. దీంతో చాలా బాధపడ్డానని.. అదే బాధతో డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పుకొచ్చాడు.

అప్పుడు తన ఫ్యామిలీ తనకు చాలా హెల్ప్ చేసిందని.. ప్రతి ఒక్కరికీ వాళ్ల లైఫ్ లో ఇలాంటి కష్టం వచ్చినప్పుడే ఫ్యామిలీ వాల్యూ ఏంటో తెలుస్తోంది అని చెప్పుకొచ్చాడు. మనతో ఎవరూ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండటానికి రాలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని లైఫ్ చాలా హ్యాపీగా జాలీగా గడిపేసుకుంటూ వెళ్లాలని అర్థం చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్.

ఆ తర్వాత నిఖిల్ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. తనకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు చాలా డిప్రెషన్ లోకి వెళ్లానని.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రావడం.. తన ఫస్ట్ సినిమా పోస్టర్ తన ఊరిలో అదే కాలేజీ పక్కన థియేటర్ బయట కటౌట్ పడిందని అన్నాడు. అది చూసి తను ఏ రీజన్ కు అయితే నన్ను వదిలేసిందో అదే కారణానికి సారీ చెప్పి నా దగ్గరికి వచ్చిందని.. కానీ అప్పటికే తనను బ్లాక్ చేశానని అన్నాడు. రాంగ్ నంబర్ అని బ్లాక్ చేశానని తన ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. మనల్ని వదిలేసి వెళ్లిపోయారే మనకేంటి అని కాదు.. మనకు ఏం రీజన్ చెప్పారనేది ముఖ్యం. నాకు ఫ్యూచర్ లో దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి కూడా కొంతమంది బ్రేకప్ చెప్పి వెళ్తారు అంటూ నిఖిల్ చెప్పాడు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పిన గౌతమ్, నిఖిల్..
ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పిన గౌతమ్, నిఖిల్..
మాకు పాఠాలు చెప్పండి మహాప్రభో.. ఉపాద్యాయులపై విద్యార్థుల ఫిర్యాదు
మాకు పాఠాలు చెప్పండి మహాప్రభో.. ఉపాద్యాయులపై విద్యార్థుల ఫిర్యాదు
3 మ్యాచ్‌లకే రిటైర్మెంట్.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
3 మ్యాచ్‌లకే రిటైర్మెంట్.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
మీరు జిమ్ చేస్తారా? అయితే ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి
మీరు జిమ్ చేస్తారా? అయితే ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టాడు.. టీమిండియా తరపున ఆడాడు
ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టాడు.. టీమిండియా తరపున ఆడాడు
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..
విక్రాంత్‌ పోస్ట్‎తో ఫ్యాన్స్‎లో కలవరం.. అసలు ఏమైంది.?
విక్రాంత్‌ పోస్ట్‎తో ఫ్యాన్స్‎లో కలవరం.. అసలు ఏమైంది.?
మీడియాపై మోహన్ బాబు దాడిని నిరసిస్తూ.. ఆందోళనకు పిలుపు
మీడియాపై మోహన్ బాబు దాడిని నిరసిస్తూ.. ఆందోళనకు పిలుపు