Brahmamudi, December 10th Episode: రుద్రాణికి ఊహించని దెబ్బకొట్టిన సీతారామయ్య.. ఆస్తి మొత్తం కావ్యకే!
అపర్ణ చెప్పడంతో కావ్యని బెడ్ రూమ్‌కి రానిస్తాడు రాజ్. కానీ బెడ్ మధ్యలో గీత గీస్తాడు. మరోవైపు ఆస్తిని ఎలాగైనా తను దక్కించుకోవాలని.. మరో ప్లాన్ చేస్తుంది రుద్రాణి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. వంట గదిలో నేల మీద పడుకోమని ఎవరు చెప్పారు? అంత మానవత్వం లేని మనుషులు ఉన్నారు? అనుకున్నావా? అని రాజ్ అరుస్తాడు. కావ్య ఈ ఇంటి కోడలు.. పని మనిషో.. వంట మనిషో కాదని అపర్ణ అంటే.. నేనేమీ అలా చూడలేదని రాజ్ అంటాడు. ఇక్కడ పడుకోవడం ఎవరైనా చూస్తే ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా? మీ తాతయ్య, నాన్నమ్మ కావ్యకి మాట ఇచ్చి తీసుకొచ్చారు. నువ్వు ఎంత అవమానించినా ఆ పెద్ద వాళ్ల మాట కాదనలేక ఇంటికి వచ్చింది. నీ భార్య ఇంటికి తిరిగి వస్తే ఇలాగేనా చూస్తారు? అని అపర్ణ నిలదీస్తుంది. నేను రావద్దని చెప్పానా అని రాజ్ అంటే.. రమ్మని మీరు పిలిచారా అని కావ్య అడుగుతుంది. వస్తే రావద్దని నేను చెప్పానా.. వస్తే రమ్మని అనను.. పొమ్మని కూడా అనను. ఇది తాతయ్య నిర్ణయం.. కాదనే ధైర్యం నాకు లేదని రాజ్ అంటాడు. ఇలా తిక్క తిక్కగా మాట్లాడొద్దు. ఇంకా ఏంటి ఇక్కడ చూస్తున్నావని కావ్యని తిడుతుంది అపర్ణ.
బెడ్‌పై గీత గీసిన రాజ్..
నీ మనసులో ఎంత సంఘర్షణ దాగి ఉందో నాకు తెలుసు. కానీ మీరు దూరంగా ఉంటే ఎప్పటి దగ్గర కాలేదనే కదా మావయ్య గారు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు దగ్గర దగ్గరగా ఉంటేనే కదా మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. ఇంకోసారి ఇలాంటి దీన స్థితలో కనిపిస్తే మాత్రం అట్లకాడతో వీపు వాయిస్తానని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. ఇక కావ్య రాజ్ బెడ్ రూమ్‌కి వెళ్తుంది. అక్కడ రాజ్ ప్లాస్టర్‌తో బెడ్‌పై మీద గీస్తాడు. అది చూసి ఏంటండీ ఇది? ఎందుకు ఈ గీత? అని కావ్య అడుగుతుంది. ఇది రాజ్ లేఖ.. ఈ గీత దాటి నువ్వు ఇక్కడ పడుకోకూడదని రాజ్ అంటాడు. ఒక వేళ మీరు ఇటు జరిగితే అని కావ్య అడుగుతుంది. నేను జరగనని రాజ్ అంటాడు. అలా జరిగితే నా తలరాత ఎందుకు ఇలా తగల బడుతుంది? ఈపాటికి పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటుందని కావ్య అనుకుంటుంది. ఏంటీ అని రాజ్ అడిగితే.. ఏమీ లేదని కావ్య అంటుంది.
మనసు ముక్కలు చేయడం మీకు అలవాటే..
మా మమ్మీ చెప్పింది నా గదిలో నీకు చోటు ఇమ్మని అందుకే.. అటువైపు నీకు.. ఇటు వైపు నీకు అని రాజ్ చెప్తాడు. భార్యాభర్తలు అన్నీ సగం సగం పంచుకోమని చెప్పారు కానీ.. బెడ్ రూమ్ కూడా పంచుకోమని చెప్పలేదు. ఆ క్రెడిట్ మీకేనని కావ్య అంటుంది. అవును అని రాజ్ నిద్రపోతాడు. కావాలనే కావ్య.. అటువైపుకు వెళ్లి నీళ్లు తీసుకుంటుంది. ఏయ్ ఏంటి.. ఇటు రావద్దని చెప్పాను కదా.. అని రాజ్ అంటే.. మీ వాటాలో లోటా ఉందని కావ్య అంటుంది. ఏయ్ ఏంటి.. నీ వాటాలోకి వెళ్లమని రాజ్ అంటాడు. కావ్య వెల్లిగా రాజ్ మీద పడుతూ.. వెళ్లి నీళ్ల బాటిల్ తీసుకుంటుంది. అవును ఈ బాటిల్ మధ్య గీత గీస్తారా? బాత్రూమ్‌కి, బీరువాకి కూడా గీత గీస్తారా అని కావ్య అడిగితే.. అవేమీ అవసరం లేదు.. బెడ్ మీద మాత్రమేనని రాజ్ అంటాడు. ఇంత దాకా వచ్చింది కాబట్టి చెబుతున్నా.. మీరు బాధ పడి.. ఈ గీత గీసి బాధ పడాల్సిన అవసరం లేదు. మీరు భార్యగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్న రోజే.. ఈ బెడ్ మీద పడుకుంటా. మనసును ముక్కలు చేయడం, బెడ్‌ని ముక్కలు చేయడం మీకు బాగా అవాటైపోయిందని కావ్య అంటుంది. హమ్మయ్యా నువ్వు ఇదే మాట మీద ఉండు.. నాకు కూడా మంచిదే. ఏదో తాతయ్య గారు చెప్పారని ఒప్పుకున్నా.. కానీ మనం కాపురం చేసే ప్రసక్తే లేదని రాజ్ అంటాడు. ఇక కావ్య చాప వేసుకుని దాని మీద పడుకుంటుంది.
రుద్రాణి కొత్త స్కెచ్..
మరోవైపు రుద్రాణి తెగ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రాహుల్ వస్తాడు. ఏంటి మమ్మీ ఇంకా పడుకోలేదా అని అడిగితే.. ఈ ఇంట్లో ప్రశాంతంగా ఎప్పుడు పడుకున్నా.. నీ కోసమే ఆలోచిస్తున్నా.. ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నాని అంటుంది. అదేంటి.. తాతయ్య మనకు ఆస్తిలో వాటా ఉందని చెప్పాడు కదా అని రాహుల్ అంటాడు. అన్నాడు.. కానీ ఇప్పుడు కోమాలో ఉన్నాడు కదా.. లేచి వస్తే ప్లాన్ ఏ అమలు చేస్తా.. లేదంటే ప్లాన్ బి ఉండాలి కదా.. ఒక పని చేయి రేపు నువ్వు ఒక చెక్ తీసుకుని రాజ్ దగ్గరకు వెళ్లి.. నాకు రెండు కోట్లు కావాలని, చెక్ మీద సైన్ చేయమని అడుగు అని రుద్రాణి అంటుంది. అందుకు రాహుల్ నవ్వుతూ.. నీకు పిచ్చి కానీ.. నేను చెక్ తీసుకెళ్లి రెండు కోట్లు ఇవ్వమని అడిగితే నన్ను చీప్‌గా చూస్తాడు. నా చరిత్ర అంతా వాడికి తెలుసు కదా అని రాహుల్ అంటే.. రేయ్ దీన్నే ఆఫ్ నాలెడ్జ్ ఇదే.. నిన్ను నేనే నమ్మను.. కానీ రాజ్ ఎలా ఇస్తాడని అనుకుంటా.. అదే చెక్ ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి.. రెచ్చగొట్టి సంతకం పెట్టిస్తానని రుద్రాణి అంటుంది. ఆవిడ అడిగితే సైన్ పెట్టేస్తాడా అని రాహుల్ అడుగుతాడు. పెట్టకపోతేనే కదా.. అప్పుడు గొడవ మొదలవుతుందని రుద్రాణి ప్లాన్ చేస్తుంది.
రాహుల్‌ని ఛీ కొట్టిన ప్రకాశం..
ఇక తెల్లవారుతుంది. రుద్రాణి, రాహుల్‌ల ప్లాన్ ప్రకారం.. రాజ్ దగ్గరకు వెళ్లిన రాజ్.. రెండు కోట్ల రూపాయల చెక్ మీద సంతకం చేయమని అడుగుతాడు. అది విని ప్రకాశం, రాజ్ షాక్ అవుతారు. ఏంటి రెండు కోట్లా.. తొడుక్కునేవా అని ప్రకాశం అంటాడు. అంత డబ్బు ఎందుకు రా అని రాజ్ అడుగుతాడు. నేను సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నానని రాహుల్ చెబుతాడు. కష్టపడి సంపాదించడంలో తప్పు లేదురా.. కానీ రెండు కోట్లు పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని ప్రకాశం అంటాడు. నేను డైమండ్ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాని రాహుల్ చెబుతాడు. అయినా అందులో నీకు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా అని రాజ్ అడిగితే.. ఎక్స్ పర్ట్స్ సలహా తీసుకుంటానని రాహుల్ చెబుతాడు. నీ చేతిలో రెండు కోట్లు పెడితే ఏం చేస్తావో ఇంట్లో అందరికీ తెలుసు. కనీసం నీ పెళ్లాం కూడా నిన్ను నమ్మదని ప్రకాశం అంటాడు. మధ్యలో రుద్రాణి వచ్చి ఏ ఎందుకు చేయకూడదని అంటుంది. ఉదయం లేస్తే నువ్వు ఎన్నో విషయాలు మర్చిపోతున్నావ్. కానీ నిన్ను ఆఫీస్‌కి పంపిస్తున్నారు కదా అని రుద్రాణి అంటే.. రుద్రాణి, రాహుల్‌ల చరిత్ర అంతా చెబుతాడు. నీకు రెండు కోట్లు కాదు కదా.. రెండు లక్షలు కూడా ఇవ్వమని ప్రకాశం అంటాడు.
ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టిన రుద్రాణి..
ఇవన్నీ కాదు.. రాజ్ నీ మాట కూడా ఇదేనా అని రాహుల్ అడిగితే.. రాజ్ ఇస్తానన్నా నేను ఇవ్వనివ్వనని ప్రకాశం అంటాడు. ఇక రుద్రాణి, రాహుల్‌లు కలిసి ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి డ్రామా స్టార్ట్ చేస్తారు. ఛీ ఈ ఇంట్లో వాళ్లు ఎవర్నీ నమ్మరు. వీళ్లను అడుక్కోవడం కంటే.. అడుక్కు తినడం మంచిదని అంటుంది రుద్రాణి. ఏమైందని ధాన్యలక్ష్మి అడిగితే.. రాహుల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రాజ్‌ని రెండు కోట్లు ఇవ్వమని అడిగాడు.. కానీ వాడు ఇవ్వనని చెప్పాడని రుద్రాణి అంటుంది. బిజినెస్ చేయాలి అనుకోవడం మంచిదే కదా అని ధాన్యలక్ష్మి అంటే.. మేమంటే లెక్కలేదని రుద్రాణి అంటుంది. అత్తయ్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఎవరైనా సహాయం చేస్తారు అనుకుంటే అది నువ్వే.. నువ్వు వెళ్లి రాజ్‌ని రెండు కోట్లు ఇవ్వమని చెక్ మీద సంతకం పెట్టించుకోమని అడుగుతాడు. నేనా నేను చెప్తే నా మాట వింటాడా అని ధాన్యలక్ష్మి అంటుంది. ధాన్యలక్ష్మి అడిగిన తర్వాత రాజ్ నో అంటే.. ఎక్కడ తన పరువు పోతుందేమోనని భయ పడుతుందని కావాలనే రుద్రాణి రెచ్చగొడుతుంది. నేను భయపడటం కాదు.. రాజే నాకు భయపడతాడని ధాన్యలక్ష్మి అంటుంది. తను అనుకుంటే ఏదన్నా సాధించగలదని రాహుల్ అంటాడు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌లో కావ్య మీద అంత ఆస్తి రాసేస్తాడు సీతారామయ్య.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..