Rose Sharbat: గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గూలాబీలతో అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. చర్మం, జుట్టు సమస్యలకు గులాబీలను వాడుతూ ఉంటారు. గులాబీలతో ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. గులాబీ రేకులను ఎండ బెట్టి బిర్యానీ వంటి వంటల్లో వాడుతూ ఉంటారు. అయితే గులాబీలో ఎంతో రుచికరమైన షర్బత్‌లు చాలానే తయారు చేసుకోవచ్చు..
గులాబీ పువ్వులు అంటే సాధారణంగానే అందరికీ ఇష్టం. గులాబీ పూల నుంచి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ పూలను దేవుని పూజకు ఉపయోగిస్తారు. జడ వేసుకుని ఒక్క రోజ్ పెట్టుకున్నా ఎంతో అందంగాన్ని తెచ్చి పెడుతుంది. గూలాబీలతో అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. చర్మం, జుట్టు సమస్యలకు గులాబీలను వాడుతూ ఉంటారు. గులాబీలతో ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. గులాబీ రేకులను ఎండ బెట్టి బిర్యానీ వంటి వంటల్లో వాడుతూ ఉంటారు. అయితే గులాబీలో ఎంతో రుచికరమైన షర్బత్‌లు చాలానే తయారు చేసుకోవచ్చు. వాటిల్లో ఒకటి ఇప్పుడు మీ కోసం పరిచయం చేస్తున్నాం. ఇది చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రోజ్ షర్బత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఈ రోజ్ షర్బత్‌ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ షర్బత్‌కి కావాల్సిన పదార్థాలు:
గులాబీ రేకులు, యాలకుల గింజలు, నిమ్మరసం, దానిమ్మ గింజల రసం, పంచదార.
రోజ్ షర్బత్ తయారీ విధానం:
ముందుగా గులాబీ రేకులను శుభ్రంగా క్లీన్ చేసి మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో వేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముద్దను ఓ లోతైన గిన్నెలోకి తీసుకోండి. ఇందులో ఇప్పుడు మరిగించిన నీళ్లను వేసి కలపండి. ఆ తర్వాత యాలకుల గింజలు కూడా వేసి కలిపి మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయం మరో గిన్నె తీసుకుని పల్చని వస్త్రం లేదా టీ వడతో వడకట్టాలి.
ఇప్పుడు వడకట్టిన నీటిలో పంచదార కలపాలి. పంచదార కరగకపోతే వేడి నీటిలో రోజ్ వాటర్ ఉన్న గిన్నె పెట్టి కరిగించాలి. ఆ తర్వాత ఇందులో దానిమ్మ గింజల రసం, నిమ్మరసం, కూలింగ్ వాటర్ లేదంటే ఐస్ క్యూబ్స్ వేసి కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రోజ్ వాటర్ సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఎండా కాలం నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులో ఇంకా చియా సీడ్స్, సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు.