25 December 2024
Pic credit -Social Media
TV9 Telugu
శీతాకాలంలో జలుబు , దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా వెల్లుల్లి సూప్ తాగుతారు. నిజానికి ఈ సూప్ చాలా రుచికరమైనది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
వెల్లుల్లి సూప్ ని తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. కనుక ఈ రోజు ఎవరు వెల్లుల్లి సూప్ తాగకూడదనే విషయం గురించి తెలుసుకుందాం..
ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు, గర్భిణులు , క్యాన్సర్ రోగులు, చర్మ అలర్జీలతో బాధపడేవారు వెల్లుల్లి సూప్‌ను తాగకూడదని ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా చెప్పారు.
మహిళలు పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం ఉన్న మహిళలు లేదా ఎక్కువగా మందులు వాడే వారు కూడా వెల్లుల్లి సూప్‌కు దూరంగా ఉండాలని చెప్పారు.
వెల్లుల్లి స్వభావం వేడిగా ఉంటుందని డాక్టర్ గుప్తా చెప్పారు. అటువంటి పరిస్థితిలో ఎసిడిటీ ఉన్నవారు వెల్లుల్లిని తినడం వల్ల ఛాతీలో మంటగా అనిపిస్తుంది.
గర్భిణీ స్త్రీలు కూడా వెల్లుల్లి సూప్ తాగకూడదు. ఎందుకంటే వెల్లుల్లి గర్భాశయాన్ని ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రసవ నొప్పిని కలిగిస్తుంది.
ఎవరైనా ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంటే వెల్లుల్లిని తీసుకునే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి. మీరు వెల్లుల్లిని ఎలా తినవచ్చో డాక్టర్ మీకు చెప్తారు.