AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ వార్నింగ్‌ ఇచ్చింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడుతాయని IMD అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. సముద్రవేటకు వెళ్లొద్దని సూచించారు.

Rain Alert: తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు
Weather Updates
Ram Naramaneni
|

Updated on: Dec 26, 2024 | 8:05 AM

Share

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యంతో పాటు.. నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 24 గంటల్లో కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచించారు. ప్రధాన ఓడ రేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన వరి పంట నీటిపాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాలో ప్రత్తి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకోవాలి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణపై అల్పపీడన ప్రభావం పడింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆకాశం నలువైపులా మేఘాలు ముసురుకోవడంతో పగలంతా చల్లబడింది. కొన్నిచోట్ల ముసురు పడగా.. చాలాచోట్ల చిరుజల్లులు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల దగ్గరకు తెచ్చిన రైతుల ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కోనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కోనుగోళ్లు స్పీడ్ అప్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు హైదరబాద్‌లో అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. ఓవైపు చలి.. మరోవైపు చిరుజల్లులతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్ప పీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలతో పాటు రాబోయే ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి 

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా