డాలర్‌ డ్రీమ్స్‌తో దొంగ దారుల్లో అమెరికాకు.. ఈడీ నిఘాతో వెలుగులోకి సంచలనాలు..!

డాలర్‌ డ్రీమ్స్‌తో యువతను దొంగ దారుల్లో అమెరికాకు పంపిస్తోన్న దళారీ ఏజెన్సీలపై ఈడీ నిఘా పెట్టింది, ముంబై, నాగ్‌పూర్‌ కేంద్రంగా ఈ దందా చేస్తున్నట్టు గుర్తించింది. మనీ లాండరింగ్‌ కేసులో పిడికిలి బిగిస్తే అక్రమచొరబాట్ల డొంక కదులుతోంది. యూనివర్సిటీలతో సహా విదేశీ ఇన్‌స్టిట్యూట్‌ల పేరుతో దాదాపు 35,000 మంది విద్యార్థి వీసాలు పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెల్లడైంది.

డాలర్‌ డ్రీమ్స్‌తో దొంగ దారుల్లో అమెరికాకు.. ఈడీ నిఘాతో వెలుగులోకి సంచలనాలు..!
Illegal Immigration
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 26, 2024 | 1:31 PM

కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ దృష్టి సారించింది. యువత డాలర్‌ డ్రీమ్స్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఏజెంట్‌ మాఫియా అక్రమ చొరబాట్లకు తెరలేపింది. కెనడా, అమెరికాలో విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారిని ట్రాప్‌ చేస్తున్న వైనాన్ని ఈడీ గుర్తించింది. ప్లేస్‌మెంట్స్‌ పేరిట మనీలాండిరింగ్‌తో భారీగా డబ్బులు దండుకున్నట్టు దర్యాప్తులో తేల్చింది. ఈ దందాకు తెరలేపిన కెనడాలోని కొన్ని కాలేజీలు, ఇండియన్‌ ఏజెన్సీలపై దర్యాప్తు చేపట్టారు ఈడీ అధికారులు.

2002లో కెనడా నుంచి అక్రమంగా అమెరికాకు తరలిస్తుండగా గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం చలిని తట్టుకోలేక చనిపోయారు. మానిటోబా ప్రావిన్స్‌లో US-కెనడా సరిహద్దులోని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ పరిధిలో 19 జనవరి 2022న, జగదీష్ పటేల్ (39), వైశాలి జగదీష్ పటేల్ (37), విహంగీ జగదీష్ పటేల్ (11), మూడేళ్ల ధార్మిక్ జగదీష్ పటేల్ సరిహద్దుకు 12 కిలోమీటర్ల దూరంలో చనిపోయారు. ఈ ఘటన ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ప్రధాన నిందితుడు భవేష్‌ పటేల్‌తోపాటు మరికొందరిపైనా మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. కూపీలాగిన కొద్దీ ఇండియా టూ అమెరికా వయా కెనడా దళారుల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ప్లేస్‌మెంట్స్‌ పేరు చెప్పి బారత యువతను దగా చేస్తున్నాయి కొన్ని సంస్థలు.

ముందుగా విద్యార్ధులకు కెనడాలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తుంటారు. కానీ కెనడాకు వెళ్లాక అక్కడి కాలేజీల్లో చదవకుండా.. ఫీజు రిటర్న్‌ తీసుకుంటున్నారు. కెనడా సరిహద్దు నుంచి వారిని అక్రమంగా అమెరికాకి పంపిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్ధి నుంచి దళారులు 60 లక్షలు వసూలు చేస్తున్నట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించారు. ముంబయి, నాగ్‌పూర్‌ కేంద్రంగా ఇలాంటి దందా చేస్తున్న రెండు ఏజెన్సీలను ఈడీ అధికారులు గుట్టురట్టు చేశారు. ఏటా 35 వేల మందిని కెనాడా ద్వారా అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. ఈ వ్యవహారం సహా మనీలాండరింగ్‌ డొంక కదిలిస్తున్నారు ఈడీ అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..