Vemulawada: వేములవాడ ఆలయం ప్రాంగణంలో చికెన్‌ బిర్యానీ పంపకం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మరో వివాదం తెరపైకి వచ్చింది. శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చికెన్‌ బిర్యానీ పంపకం కలకలం రేపింది.‘హ్యాపీ బర్త్‌డే’, ‘మెర్రీ క్రిస్మస్‌’ అని ముద్రించిన ప్యాకెట్లు కనిపించడంతో ఇది అన్యమతప్రచారంలో భాగమనే విమర్శలు వ్యక్తమయ్యాయి. బీజేపీ నేతలతో పాటు భక్తులు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థల పేర్లతో కూడిన కొన్ని ప్యాకెట్లను కూడా వారు గుర్తించారు.

Vemulawada: వేములవాడ ఆలయం ప్రాంగణంలో చికెన్‌ బిర్యానీ పంపకం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
Chicken Biryani In Temple
Follow us
G Sampath Kumar

| Edited By: Surya Kala

Updated on: Dec 26, 2024 | 7:54 AM

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, కొందరు ఇలా చికెన్‌ బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటన జరగడం, పైగా ప్రధాన ఆలయం సమీపంలోని బిర్యానీ ప్యాకెట్లను పంచడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న స్థానిక బిజెపి నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని మాంసహారంతో కూడిన పాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అయితే ఆలయ ప్రాంగణంలో అనే మతానికి చెందిన మాంసాహారం ప్యాకెట్ లను పంపిణీ చేసిన ఆలయ యంత్రాంగం గమనించకపోవడం పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజన్న ఆలయంలో రోజుకో వివాదంతో మసకబారుతోంది ఈ సంఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.జరిగిన సంఘటనపై ఆలయ ఈవోతో పాటు పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు స్థానికులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..