Andhra Pradesh: శ్రీలంక నాయకుల్లాగా మీరూ పారిపోతారు.. వైసీపీపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పర్యటన కొనసాగుతోంది. ముంపు బాధితులను పరామర్శించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తే...
పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పర్యటన కొనసాగుతోంది. ముంపు బాధితులను పరామర్శించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తే ఆందోళనలు చెలరేగి, శ్రీలంక (Sri Lanka) పాలకుల లాగా పారిపోవడం ఖాయమని మండిపడ్డారు. పోలవరాన్ని ముంచేశారన్న చంద్రబాబు.. డ్యాం నిర్మాణం పూర్తి చేసి ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని చెప్పారు. పోలవరం పూర్తై నదులు అనుసంధానం అయ్యుంటే ప్రతి ఎకరాకు నీరు వచ్చేదన్నారు. తెలంగాణలో వరద బాధితులకు ఇంటికి రూ.10 వేలు ఇస్తే ఇక్కడ రూ.2 వేలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం (ఇవాళ) కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండో రోజు పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాత్రి పాలకొల్లులో బస చేసిన చంద్రబాబు అక్కడి నుంచి పర్యటన ప్రారంభించారు.
మధ్యాహ్నం నరసాపురం మండలం పొన్నపల్లిలో గోదావరి గట్టును పరిశీలించి, సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం (Rajamahendravaram) ఎయిర్ పోర్టుకు వెళ్లి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి