Annamacharya: సింగర్ శ్రావణ భార్గవి సహా ఆ సినిమా పాటపై లీగల్ చర్యలు.. అన్నమయ్య వారసుల హెచ్చరిక

అన్నమయ్య కీర్తనలను శృంగార భరితంగా చూపుతున్నారంటూ..   అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య ను సినిమా రచయిత గా చూడవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు తాళ్ళపాక అన్నమాచార్య వారసులు.

Annamacharya: సింగర్ శ్రావణ భార్గవి సహా ఆ సినిమా పాటపై లీగల్ చర్యలు.. అన్నమయ్య వారసుల హెచ్చరిక
Annamacharya Song
Follow us
Surya Kala

|

Updated on: Jul 22, 2022 | 1:29 PM

Annamacharya: తిరుమల(Tirumala)  శ్రీ వెంకటేశ్వరస్వామిని (Sri Venkateswara Swamy) కీర్తిస్తూ అన్నమయ్య భక్తుడిగా పాడిన కీర్తనలను శృంగారభరితంగా చిత్రీకరించడంపై వివాదం కొనసాగుతూనే ఉంది.. శ్రావణ భార్గవి సాంగ్ సహా పలు సినిమాల్లోని అన్నమాచార్య సాంగ్స్ పై  చట్టపరమైన చర్యలకు అన్నమయ్య వంశీకులు సిద్ధమయ్యారు. అన్నమయ్య సంకీర్తనలను సినిమాల్లో అసభ్యకరంగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య వంశీకులు టిటిడి కి విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో అన్నమయ్య సంకీర్తనలు సినిమాల్లో అసభ్యంగా చూపలేదని తెలిపారు. అయితే ఇప్పుడే అన్నమయ్య కీర్తనలను శృంగార భరితంగా చూపుతున్నారంటూ..   అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య ను సినిమా రచయిత గా చూడవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు తాళ్ళపాక అన్నమాచార్య వారసులు.

అన్నమయ్య కీర్తనలు శృంగారం, వైరాగ్యం, జ్ఞానం, భక్తి పై ఉన్నాయి. అయితే అన్నమయ్య కీర్తనల్లో శృంగార సంకీర్తనలే ఎక్కువగా లభించాయి. అన్నమయ్య 32 సంకీర్తనల్లో 14వేల సంకీర్తనలు లభ్యం అయ్యాయని తెలిపారు. సినిమాల్లో అభ్యంతరకరంగా ఉన్న కీర్తనలు తొలగించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతున్నామని చెప్పారు. అన్నమయ్య వంశీకులుగా మాకు ఉన్న అభ్యంతరాలపై టీటీడీ ని కలిసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ మధ్య కాలంలో శ్రీవారి సుప్రభాత సేవ, అభిషేక సేవ లో ఆలపించే అన్నమయ్య కీర్తనలను శృంగార భరితంగా చూపుతున్నారు. అభ్యంతరకరంగా చిత్రీకరించారు. ఒకపరి కీర్తనను తన అందాలను చూపుతూ శ్రావణ భార్గవి ఆల్బమ్ చేసారు. యూ ట్యూబ్ నుంచి తొలగించాలని సూచించారు. లేదంటే తాము కోర్టును అశ్రయిస్తామని శ్రావణ భార్గవిని హెచ్చరించారు అన్నమాచార్య వారసులు. సుప్రభాత సేవలో పాడే మేలుకో శృంగార రాయ పాటను కూడా ఒక సినిమా అభ్యంతరకరంగా చూపించారని గుర్తు చేసుకున్నారు.. వీటన్నింటిపైనా అన్నమయ్య వంశీకులుగా కోర్టుకు కూడా వెళతామని తాళ్ళపాక హరినారాయణ చార్యులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని  ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..