Vastu Tips: తులసిని ఈ విధంగా పూజిస్తే లక్ మీ సొంతం.. ఇంట్లో తులసిని పెంచుకోవడానికి ఈ నియమాలు తప్పనిసరి

తులసి మొక్కను నాటడం నుంచి నీరు పోయడం పూజ కు సంబంధించి వాస్తు, జ్యోతిష్య శాస్త్రంలో  కొన్ని నియమాలను పేర్కొన్నారు.  ఈరోజు ఇంట్లో తులసికి సంబంధించిన ముఖ్యమైన వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.. 

Vastu Tips: తులసిని ఈ విధంగా పూజిస్తే లక్ మీ సొంతం.. ఇంట్లో తులసిని పెంచుకోవడానికి ఈ నియమాలు తప్పనిసరి
Tulasi Plant
Follow us
Surya Kala

|

Updated on: Jul 21, 2022 | 1:57 PM

Vastu Tips: హిందూమతంలో తులసి మొక్కకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది.  తులసిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావించి పూజిస్తారు.  ఎవరికైనా ఆర్థిక సమస్య ఉంటే..  తులసి మొక్కను లక్ష్మీ దేవి రూపంలో పూజించడం వలన ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని నమ్మకం.    అయితే  తులసి మొక్కను నాటడం నుంచి నీరు పోయడం పూజ కు సంబంధించి వాస్తు, జ్యోతిష్య శాస్త్రంలో  కొన్ని నియమాలను పేర్కొన్నారు.  ఈరోజు ఇంట్లో తులసికి సంబంధించిన ముఖ్యమైన వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం..

ఎవరైనా ఇంట్లో తులసి మొక్కను నాటాలనుకుంటే.. అందుకు ఉత్తమ సమయం కార్తీక మాసం. తులసిని లక్ష్మీదేవి రూపంగా. విష్ణువుకి అత్యంత ఇష్టమైన మొక్కగా భావిస్తారు..  మీరు ఇంట్లో తులసి మొక్కను కార్తీకమాసంలో నాటితే.. లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుందని విశ్వాసం.

ఇంట్లో వాస్తు ప్రకారం తులసిని పెంచుకోవడానికి నియమాలు: వాస్తు శాస్త్రం ప్రకారం.. తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటాలి. ఈ దిక్కున దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. తులసి మొక్కను ఇంటి బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. కానీ వాస్తు శాస్త్రంలో ఇచ్చిన దిశను జాగ్రత్తగా చూసుకోవాలి. తులసి మొక్కలను పొరపాటున కూడా ఇంటికి దక్షిణ దిశలో నాటకూడదు. ఈ దిశ పూర్వీకులకు చెందినది. ఈ దిశలో తులసి మొక్కను ఉంచినట్లయితే.. ఆ ఇంటి సభ్యులకు ఆర్ధిక ఇబ్బందులు, భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందట. తులసి మొక్కను ఇంటి ప్రవేశద్వారం వద్ద లేదా చెత్తను ఉంచే లేదా చెప్పులను విడిచే వంటి ప్రదేశాలలో ఎప్పుడూ నాటకూడదు. తులసికి పసుపు, కుంకుమలతో పూజలను చేయడం ఉత్తమం. తులసి మొక్కను ఎల్లప్పుడూ మట్టి కుండలో పెంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలను ఎప్పుడూ ఉపయోగించవద్దు. వీలైతే. తులసి మొక్క పెంచుకునే కుండీకి పసుపుతో ‘శ్రీ కృష్ణ’ అని రాయండి. తులసి మొక్క బుధ గ్రహానికి చిహ్నం.. ఈ గ్రహం శ్రీకృష్ణుని రూపంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

తులసి పూజకు వాస్తు నియమాలు: తులసిని నిత్యం పూజించవచ్చు కానీ సాయంత్రం పూట తులసిని తాకరాదు. అంతేకాదు తులసిని ఏకాదశి, ఆదివారం, చంద్ర, సూర్యగ్రహణం రోజులలో కూడా తాకరాదు. ఆదివారం రోజున తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. తులసికి నీళ్ళు సమర్పించడమే కాకుండా పచ్చి పాలను కూడా సమర్పించవచ్చు. పచ్చి పాలను తులసికి సమర్పించడం వలన దురదృష్టం తొలగిపోతుందని నమ్ముతారు. తులసి మొక్కలను వంటగది లేదా బాత్రూమ్ దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. పూజ గది కిటికీ దగ్గర తులసి మొక్కను ఉంచవచ్చు. మీరు ప్రతిరోజూ తులసికి ప్రదక్షిణలు చేయాలనుకుంటే, నీరు సమర్పించేటప్పుడు, తులసి మొక్కకు మూడుసార్లు ప్రదక్షిణ చేయండి. మీరు ముందుగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించి.. అనంతరం తులసికి నీటిని సమర్పించాలి. తులసి ఆకులను 15 రోజులు శ్రీకృష్ణుడికి సమర్పిస్తే శుభఫలితాలు పొందుతారు. ఆకులు ఎండిపోయినప్పుడు వాటిని ప్రసాదంగా తీసుకోవచ్చు. సాధారణంగా ప్రజలు తులసికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఎరుపు అంగారక గ్రహం , తులసి బుధుడిని సూచిస్తుంది. బుధుడికి అనుకూలమైన గ్రహాలు శుక్రుడు, శని. కావున తులసికి తెలుపు, ప్రకాశవంతమైన, నీలిరంగు వస్త్రాన్ని సమర్పించవచ్చు. మీ ఇంట్లో ఎప్పుడూ 1, 3, 5 లేదా 7 తులసి మొక్కలు ఉండాలి. తులసి మొక్కను 2, 4, 6 ఈ సంఖ్యలలో ఎప్పుడూ పెంచుకోవద్దు. తులసి మొక్కను అపరిశుభ్రమైన చేతులతో లేదా మురికి చేతులతో తాకరాదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..