AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rameshwaram: త్రేతాయుగం నాటి క్షేత్రం.. సీతారాములు పూజించిన శివలింగం.. ఆసక్తికరమైన విశేషాలు మీకోసం

రామేశ్వరం జ్యోతిర్లింగంతో ముడిపడి ఉన్న పౌరాణిక కథ, పూజలు,    మతపరమైన ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.. ఇక్కడ శివలింగం సీతారాములతో పూజలను అందుకుంది

Rameshwaram: త్రేతాయుగం నాటి క్షేత్రం.. సీతారాములు పూజించిన శివలింగం.. ఆసక్తికరమైన విశేషాలు మీకోసం
Rameswaram
Surya Kala
|

Updated on: Jul 20, 2022 | 11:49 AM

Share

Rameshwaram Jyotirlinga: ద్వాదశ జ్యోతిర్లింగాలకు హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ జ్యోతిర్లింగాలు స్వయంగా వెలసినవని.. మానవ నిర్మితాలు కాదని నమ్మకం. సనాతన హిందూ మతానికి సంబంధించిన చార్ ధామ్‌లలో ఒకటైన రామేశ్వర.. జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది. ఉత్తర భారతదేశంలోని కాశీ విశ్వనాథునికి ఎంత ప్రాముఖ్యత ఉందో..  దక్షిణ భారతదేశంలో ఈ జ్యోతిర్లింగానికి అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ క్షేత్రం ఏడాది పొడవునా శివ భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రావణ మాసంలో ఇక్కడ శివయ్యని దర్శించుకోవడానికి విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. రామేశ్వరం జ్యోతిర్లింగంతో ముడిపడి ఉన్న పౌరాణిక కథ, పూజలు,    మతపరమైన ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.. ఇక్కడ శివలింగం సీతారాములతో పూజలను అందుకుంది.

రామేశ్వరం జ్యోతిర్లింగ కథ తమిళనాడులోని సముద్ర తీరం వద్ద ఉన్న ఈ ఆలయం రామాయణ కాలం నాటిదిగా పరిగణించబడుతుంది. అయోధ్య రాజైన రాముడు, రావణుడు, లంకాపతితో యుద్ధం చేసే ముందు.. విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రదేశంలో ఇసుక శివలింగాన్ని తయారు చేసి శివుడిని పూజించాడని నమ్ముతారు. అనంతరం శివుడు ఇక్కడ జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. రాముడు లంకను జయించి తిరిగి వచ్చే సమయంలో  బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడటానికి శివుడిని పూజించమని ఋషులు చెప్పినట్లు పురాణాల కథనం. కైలాసానికి వెళ్లి శివలింగానికి తీసుకుని రమ్మని మని హనుమంతుడిని శ్రీరాముడు కోరాడు… అయితే హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి చాలా సమయం తీసుకోవడంతో.. సీతమ్మ తల్లి.. తన చేతితో స్వయంగా శివలింగాన్ని తయారు చేసింది. ఆ లింగాన్ని రాముడు పూజించాడు. ఇప్పుడు ఇక్కడ పూజలను అందుకుంటున్న   ఆ శివలింగాన్ని రామేశ్వరం అంటారు. దీని తరువాత.. ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన శివలింగం కూడా అక్కడ స్థాపించబడింది. హనుమంతుడు తీసుకువచ్చిన శివలింగానికి విశ్వనాథర్ అనే పేరుతో పూజలను అందుకుంటున్నాడు.

ఆకర్షణీయంగా ఆలయ నిర్మాణం: రామేశ్వరం ఆలయ నిర్మాణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయం మొత్తం దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది, దాని చుట్టూ బలమైన రాతి గోడలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రవేశ ద్వారం 40 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం దాని ప్రాకారాలు కూడా ప్రసిద్ధి చెందాయి. చాలా అందమైన ప్రాకారాల్లో 108 శివలింగం , గణపతి కనిపిస్తాయి. ప్రాకారాలు చెక్కడం చూడదగ్గ దృశ్యం.

ఇవి కూడా చదవండి

24 బావుల పవిత్ర జలం: రామేశ్వరం ఆలయం లోపల 24 బావులు ఉన్నాయి. ప్రజలు ఈ బావులను పవిత్ర పుణ్యక్షేత్రాలుగా పూజిస్తారు. ఈ బావుల్లోని నీటితో స్నానం చేస్తారు. ఈ పవిత్ర బావుల నీటిలో స్నానం చేయడం వల్ల ప్రజల పాపాలు నశిస్తాయి అని నమ్ముతారు. ఈ బావులను శ్రీరాముడు తన బాణంతో నిర్మించాడని ప్రతీతి.

రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని ఎలా చేరుకోవాలి? మీరు రామేశ్వరానికి వెళ్లాలనుకుంటే.. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు మీకు ఉత్తమమైనది, ఎందుకంటే ఈ సమయంలో ఇక్కడ చలి లేదా వేడి ఉండదు. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మీరు రైలు మార్గంలో వెళ్లాలనుకుంటే మధురై మీదుగా రైలులో నేరుగా ఇక్కడికి చేరుకోవచ్చు. మీరు విమానంలో వెళ్లాలనుకుంటే మధురై విమానాశ్రయంలో దిగి టాక్సీలో వెళ్లవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి