Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 Zodiac Signs: ఈ ఐదు రాశులవారితో బంధం చాలా సంతోషంగా ఉంటుందట.. అందులో మీరున్నారా తెలుసుకోండి…

12 రాశుల్లోకెల్లా.. ఆ ఐదు రాశుల వారితో బంధం చాలా సంతోషంగా ఉంటుందట. అందులో మీరు లేదా మీ బాస్ లేదా స్నేహితులు ఉన్నారేమో తెలుసుకోండి..

5 Zodiac Signs: ఈ ఐదు రాశులవారితో బంధం చాలా సంతోషంగా ఉంటుందట.. అందులో మీరున్నారా తెలుసుకోండి...
5 Zodiac Signs
Follow us
Surya Kala

|

Updated on: Jul 20, 2022 | 11:41 AM

5 Zodiac Signs:హాస్యం కలిగి ఉన్న వ్యక్తులు బహు అరుదు.. సరదాగా, సందడిగా ఉండడం అందరికి సాధ్యం కాదు. ఈరోజు ఎవరు రాశుల ప్రకారం.. తమాషాగా, సంతోషంగా ఉంటారో.. తెలుసుకుందాం.. ముఖ్యంగా 12 రాశుల్లోకెల్లా.. ఆ ఐదు రాశుల వారితో బంధం చాలా సంతోషంగా ఉంటుందట. అందులో మీరు లేదా మీ బాస్ లేదా స్నేహితులు ఉన్నారేమో తెలుసుకోండి..

మిథునరాశి: ఈ రాశివారు వినోదభరితంగా గడుపుతారు. హాస్యం కారణంగా ఫేమస్ అయ్యారు. ఏదో ఒక డైలాగ్‌తో జనాన్ని నవ్విస్తూ ఉంటారు. ఈ విషయాన్ని వారు కొన్నిసార్లు గుర్తించరు కూడా.

సింహరాశి: ఈ రాశివారికి తమ చుట్టూ ఉన్నవారిని ఎలా నవ్వించాలో తెలుసు.  వీరు అందరి దృష్టిని ఆకర్షించే ఒక మార్గం నవ్వించడం. వీరు తమ మనస్సును సెట్ చేసి.. తీవ్రంగా తీసుకుంటే వారు గొప్ప స్టాండ్ అప్ కమెడియన్‌లు కూడా కాగలరు.

ఇవి కూడా చదవండి

కన్యారాశి: వారు మనం ఊహించని క్షణాల్లో చెప్పడానికి చాలా షాకింగ్ విషయాలు ఉంటాయి.  తెలివైన జోకులు వేస్తారు. వీరు గొప్ప చతురులు కాదు.. కానీ ఎప్పుడు ఏమి చెప్పాలో..  ఎలా తెలివిగా వ్యాఖ్యానించాలో ఈ రాశివారికి తెలుసు. సరైన సమయంలో సరైన వ్యక్తికి తమ జీవితంలో జరిగిన సంఘటనలు చెబుతారు.

ధనుస్సు రాశి వారు ఉద్రిక్త వాతావరణాన్ని సంతోషంగా మారేలా చేయగలరు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. నిజాయితీగల హాస్యం కలిగి ఉంటారు.

మేషరాశివారు తేలికపాటి హాస్యాన్ని కలిగి ఉంటారు. వారు ఓహిస్కాలిటీలపై కూడా జోకులు వేస్తారు కానీ అవతలివారి మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకుంటారు. వారు తమ సహచరులు, స్నేహితులు మొదలైన వారితో బంధం కోసం జోక్‌లను ఉపయోగిస్తారు. వారు తమాషా ముఖాలు, వెర్రి నడకలను అనుకరించడం మొదలైన వాటిని ఇష్టపడతారు.

వృశ్చిక రాశివారు చాలా చతురతను కలిగి ఉంటారు. చార్లీ షీన్ లాగా చాలా ఫన్నీగా ఉంటారు. ఎప్పడూ సరదాగా, సంతోషముగా నవ్విస్తూ..  డార్క్ మెటీరియల్‌ని కలిగి ఉంటారు.

మకరం, కుంభం, కర్కాటకం, వృషభం, మీనం , తుల రాశి వారు హాస్య విషయానికి వస్తే ఫర్వాలేదు. వీరిలో కొందరు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)