Horoscope Today: బుధవారం రాశిఫలాలు.. నేడు 12 రాశులవారికి ఏ విధంగా ఉంటుందంటే..

తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 20వ  తేదీ ) బుధవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: బుధవారం రాశిఫలాలు.. నేడు 12 రాశులవారికి ఏ విధంగా ఉంటుందంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Jul 20, 2022 | 6:50 AM

Horoscope Today (20-07-2022): ఏ రంగంలో ఉన్నవారైనా. సరే రోజులో కొత్త పనులు మొదలు పెట్టాలన్నా..సానుకూలంగా జరగాలని కోరుకుంటారు. మంచి చెడుల గురించి ఆలోచిస్తూ.. రోజులో తమకు ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. దీంతో తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 20వ  తేదీ ) బుధవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. అలోచించి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్తను వింటారు. సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సాయంతో పూర్తి చేస్తారు. ప్రశంసలను అందుకుంటారు చేపట్టిన పనిని సకాలంతో పూర్తి చేయడానికి పని చేస్తారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. అధిక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖమైన పనులను ప్రారంభించండి. ఆలోచనా విధానంతో మంచి పేరు సొంతం చేసుకుంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మానసికంగా సంతోషంగా ఉంటారు అధిక వ్యయం చేస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి పనులను పూర్తి చేయడానికి అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది.కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు. బంధు, మిత్రుల వలన మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులు శుభఫలితాలను అందుకుంటారు. కీలక సమస్యను పరిష్కరిస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ముఖ్య పనులల్లో ఆర్ధిక సాయం అందుకుంటారు. మిశ్రమ ఫలితాలను పొందుతారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక వ్యయం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఆయా రంగాల్లోని వారు జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు.కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సాహంగా గడుపుతారు. మానసికంగా సంతోషంగా గడుపుతారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారు శుభ ఫలితాలను అందుకుంటారు.   మీ పని తీరుతో ఇతరులతో ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.ఆర్థికంగా మేలు చేకూరుతుంది

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)