Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravana Masam 2022: శ్రావణ సోమవారం శివపార్వతులకు ప్రీతికరమైన రోజు.. పెళ్లికాని యువతులు ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడట..

Shravan Month 2022: చాలా మంది శివ భక్తులు శ్రావణ సోమవారం ఉపవాసం ఉంటారు.  ఆ రోజున శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీంతో భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం.

Shravana Masam 2022: శ్రావణ సోమవారం శివపార్వతులకు ప్రీతికరమైన రోజు.. పెళ్లికాని యువతులు ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడట..
Sravan Monday
Follow us
Surya Kala

|

Updated on: Jul 17, 2022 | 9:03 AM

Shravana Masam 2022: శ్రావణ మాసం శివునికి ప్రీతికరమైనది. ఈ మాసంలో ప్రతి భక్తుడు శివుని వర్ణంలో కనిపిస్తాడు. శ్రావణ మాసంలో శివుడిని పూజిస్తే.. చాలా తేలికగా ప్రసన్నుడవుతాడని భక్తుల నమ్మకం. భగవంతుని ఆశీర్వాదం కోసం,ఆశించిన ఫలితాలను పొందడానికి.. ప్రజలు ఈ మాసంలో శివుడిని పూజిస్తారు. అందుకనే శ్రావణ మాసంలోని సోమవారానికి కూడా ప్రాముఖ్యత ఉంది. చాలా మంది శివ భక్తులు శ్రావణ సోమవారం ఉపవాసం ఉంటారు.  ఆ రోజున శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీంతో భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం. అయితే శ్రావణ సోమవారం ఎందుకు అంత ముఖ్యమైనదిగా భావిస్తారో ఈరోజు  తెలుసుకుందాం.

శ్రావణ సోమవారం- ప్రత్యేకం పరమశివుని మొదటి భార్య  దక్షుడి కూతురు సతీదేవి. తన భర్త శివునికి తన తండ్రి దక్షుడి ఇంట్లో జరిగిన అవమానించడాన్ని చూసి తట్టుకోలేక తన దేహాన్ని  దక్షుడు చేస్తోన్న యాజ్ఞకుండ్‌లో  దేహం చాలించిందని పురాణాల కథనం. సతీదేవి తరువాత హిమాలయ కుమార్తె పార్వతిగా జన్మించింది. పార్వతి రూపంలో శివుడిని కూడా తన వరుడిగా ఎంచుకుంది. శివుడిని భర్తగా పొందేందుకు తీవ్ర తపస్సు చేసింది. శ్రావణ మాసంలో..  శివుడు.తుల కళ్యాణం జరిగింది. అప్పటి నుండి ఈ మాసమంతా ఆదిదంపతులైన శివపార్వతులకు ఇష్టమైన నెలగా మారింది. సోమవారం శివపార్వతులకు కి అంకితం చేయబడినందున ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. సాధారణంగా సోమవారం నాడు ఉపవాసం ఉండని శివభక్తులు కూడా శ్రావణ సోమవారం రోజున  ఉపవాసం ఉంటారు.

శ్రావణ సోమవారం- ప్రాముఖ్యత శ్రావణ సోమవారం ఉపవాసం ఉండడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతారు. వివాహిత స్త్రీలు ఆదిదంపతుల అనుగ్రహాన్ని పొందుతారు. భర్త దీర్ఘాయువును పొందుతారు. మరోవైపు పెళ్లికాని అమ్మాయిలు శ్రావణ సోమవార వ్రతాన్ని పాటిస్తే తగిన వరుడు లభిస్తాడు.

ఇవి కూడా చదవండి

ఎలా పూజించాలంటే: శ్రవణ సోమవారాల్లో..  ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత..  తూర్పు లేదా ఉత్తరం వైపున ఆసనం వేసుకుని కూర్చోండి. శివపార్వతులకు పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె , గంగాజలంతో స్నానం చేయండి. అనంతరం చందనం, పూలు, పండ్లు, ధూపం, దీపం,  కుంకుమ, బట్టలు, బిల్వ పత్రం, గంజాయి, ఉమ్మెత్తపువ్వు వంటివి శివయ్యకు సమర్పించండి. గణపతికి దర్భను సమర్పించండి. పూజ అనంతరం.. శివ చాలీసా, శివ మంత్రాలను జపించండి. శ్రావణ సోమవారం వ్రత కథను చదవండి. మీ కోరికను నెరవేర్చమని శివుడిని ప్రార్థించండి. ఆ తర్వాత హారతి ఇచ్చి.. పూజ అనంతరం ప్రసాదం పంచండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం పై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్‌
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్‌
JEE మెయిన్‌లో 24 మందికి 100 పర్సంటైల్‌.. టాప్‌ ర్యాంకర్లు వీరే..!
JEE మెయిన్‌లో 24 మందికి 100 పర్సంటైల్‌.. టాప్‌ ర్యాంకర్లు వీరే..!
14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. తొలి బంతికే సిక్స్‌తో కొత్త చరిత్ర
14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. తొలి బంతికే సిక్స్‌తో కొత్త చరిత్ర
ఈ పరుగు మనకోసం..! ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 5కె, 10కె రన్..
ఈ పరుగు మనకోసం..! ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 5కె, 10కె రన్..
Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్
Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్
ఏసీని నాన్ స్టాప్ వాడేస్తున్నారా.. రాత్రిపూట ఈ జాగ్రత్తలు మస్ట్
ఏసీని నాన్ స్టాప్ వాడేస్తున్నారా.. రాత్రిపూట ఈ జాగ్రత్తలు మస్ట్
నీట్‌ పీజీ 2025 నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. పరీక్ష తేదీ ఇదే
నీట్‌ పీజీ 2025 నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. పరీక్ష తేదీ ఇదే
ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. 20 ఓవర్లలో 33 పరుగులు
ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. 20 ఓవర్లలో 33 పరుగులు
EAPCET 2025 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
EAPCET 2025 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..
భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..