Rajeshwar Mandir: ఆగ్రాలో రోజుకి మూడు రంగులు మారే శివలింగం.. 850 ఏళ్ల చరిత్ర గల శివాలయం విశిష్టత గురించి తెలుసుకోండి..

ఆగ్రా నగరంలో రాజేశ్వరాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజ్ మహల్‌కు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో నాలుగు దిక్కులలో వివిధ శివాలయాలు ఉన్నాయి. వీటిని ఆగ్రాలోని చార్ ధామ్ అంటారు.

Rajeshwar Mandir: ఆగ్రాలో రోజుకి మూడు రంగులు మారే శివలింగం.. 850 ఏళ్ల చరిత్ర గల శివాలయం విశిష్టత గురించి తెలుసుకోండి..
Rajeshwar Mandir, Agra
Follow us
Surya Kala

|

Updated on: Jul 12, 2022 | 8:28 AM

Rajeshwar Mandir: పాయల్ రోహత్గి , సంగ్రామ్ సింగ్ లు  వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ఆగ్రాలోని జేపీ ప్యాలెస్‌లో సాంప్రదాయ రీతిలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు ఇద్దరూ ఆగ్రాలోని ప్రముఖ రాజేశ్వర్ ఆలయానికి వెళ్లి మహాదేవుని ఆశీస్సులు పొందారు. ఆ తర్వాతే వీరి వివాహ తంతు మొదలైంది. ఈ దేవాలయం సుమారు 850 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఆగ్రాలోని శంసాబాద్ రోడ్డులోని రాజ్‌చుంగి సమీపంలో ఉన్న రాజేశ్వర ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం ఈరోజు తెలుసుకుందాం..

ఆగ్రా నగరంలో రాజేశ్వరాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజ్ మహల్‌కు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో నాలుగు దిక్కులలో వివిధ శివాలయాలు ఉన్నాయి. వీటిని ఆగ్రాలోని చార్ ధామ్ అంటారు. ఈ ఆలయాలలో ఉన్న మహాదేవుడు తాజనగరిని నాలుగు దిక్కులనూ రక్షిస్తాడని నమ్ముతారు. ఈ నాలుగు ఆలయాలలో రాజేశ్వరాలయం కూడా ఒకటి. ఈ నాలుగు ఆలయాలకు భిన్నమైన లక్షణాలు, నమ్మకాలు ఉన్నాయి. ఈ దేవాలయాలలో హృదయపూర్వకంగా ఏ కోరికనైనా శివయ్యకు వెల్లడిస్తే.. అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు. తమ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని కోరుతూ.. పాయల్ , సంగ్రామ్ లు పెళ్లి వేడుక్కి ముందు రాజేశ్వర ఆలయానికి వచ్చారు.

రాజేశ్వర ఆలయాన్ని రాజ్‌ఖేడాకు చెందిన వడ్డీ వ్యాపారి నిర్మించారని స్థానికుల కథనం. అతను ఈ శివలింగాన్ని నర్మదా నది దగ్గర నుండి తీసుకొచ్చి రాజ్‌ఖేడాలో స్థాపించాలనుకున్నాడు. అయితే రాత్రి రాజ్‌పూర్ ఆక్ట్రాయ్ ప్రాంతంలో విశ్రాంతి కోసం బస చేశారు. అప్పుడు అతని కలలో చివుడు కనిపించి.. శివలింగాన్ని ఇక్కడే  ప్రతిష్టించమని సూచించాడు. అయితే ఆ వడ్డీ వ్యాపారి తనకు వచ్చిన  కలను నమ్మలేదు.  మరుసటి రోజు అతను ఎద్దుల బండిపై శివలింగాన్ని పెట్టి.. అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాలనుకున్నాడు. ఎంత సేపు ఎద్దుల బండిని ముందుకు కదిలించాలని చూసినా.. ఆ ఎద్దుల బండి ఆ ప్రదేశం నుండి కదలలేదు. శివలింగం అక్కడ నుండి పడిపోయింది.. తనకు తానే ఆ ప్రాంతంలో  ప్రతిష్టించబడింది. అనంతరం ఆ వడ్డీవ్యాపారి.. అక్కడ నుంచి శివలింగాన్ని ఎత్తడానికి చాలా ప్రయత్నించాడు.. శివలింగాన్ని ఎత్తలేకపోయాడు.  అప్పుడాయనకి ఇది మహాదేవుని ఆజ్ఞ అని అర్థమైంది. ఆ తర్వాత శివలింగం పడిన చోటే ఆలయాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి

రాజ్‌పూర్ పన్ను ప్రాంతంలో ఉన్నందున ఈ ఆలయాన్ని రాజేశ్వర మహాదేవ అని పిలుస్తారు. ఈ శివలింగం రోజుకు మూడుసార్లు రంగు మారుతుంది. ఉదయం తెల్లగా, మధ్యాహ్నం లేత నీలం రంగులో ..  రాత్రికి గులాబీ రంగులో ఉంటుంది. శ్రావణ మాసం సోమవారం, శివరాత్రి మొదలైన పర్వదినాల్లో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే