Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sawan 2022: శ్రావణ మాసంలో కాశి క్షేత్రంలో విశ్వనాథుడి దర్శనం ఎంతో విశిష్టం.. ఈక్షేత్రానికి సంబంధించి పూర్తి వివరాలు

శ్రావణ మాసంలో  కాశీ విశ్వనాథ క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంటుంది. మూడు లోకాలకు లోక నాథుడైన శివుడికి సంబంధించిన అద్వితీయమైనదిగా భావించబడే కాశీకి సంబంధించిన కనీవినీ ఎరుగని విషయాలను వివరంగా తెలుసుకుందాం.

Sawan 2022: శ్రావణ మాసంలో కాశి క్షేత్రంలో విశ్వనాథుడి దర్శనం ఎంతో విశిష్టం.. ఈక్షేత్రానికి సంబంధించి పూర్తి వివరాలు
Kashi Viswnath Temple
Follow us
Surya Kala

|

Updated on: Jul 15, 2022 | 10:43 AM

Sawan 2022: సనాతన సంప్రదాయంలో.. ద్వాదశ జ్యోతిర్లింగ ఆరాధనకు ప్రాముఖ్యత ఉంది. దేశంలోని ప్రధాన జ్యోతిర్లింగాలలో ఒకటి కాశి విశ్వనాథుడు. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ఉంది. హిందూమతంలోని పురాతన సప్తపురిలలో ఒకటైన కాశీ నగరం లేదా వారణాసి గురించిన  మతపరమైన అనేక కథనాలున్నాయి. విశ్వనాథుడు కొలువై ఉన్న కాశీ నగర వైభవం ఎంతో విశిష్టమైనది. ఇక్కడ శివయ్యను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి మాత్రమే కాదు..  ప్రపంచం నలుమూలల నుండి కూడా ఈ క్షేత్రానికి భారీ సంఖ్యలో ప్రజలు  తరలివస్తారు. శ్రావణ మాసంలో  కాశీ విశ్వనాథ క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంటుంది. మూడు లోకాలకు లోక నాథుడైన శివుడికి సంబంధించిన అద్వితీయమైనదిగా భావించబడే కాశీకి సంబంధించిన కనీవినీ ఎరుగని విషయాలను వివరంగా తెలుసుకుందాం.

  1. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వనాథుడి తొమ్మిదవ స్థానం. ఈ క్షేత్రంలోని శివలింగం ఏ వ్యక్తి లేదా దేవత ద్వారా స్థాపించబడలేదని నమ్మకం. స్వయంగా శివుడు నివసించి వెలసిన క్షేత్రమని నమ్మకం.
  2. స్వామి విశ్వనాథ ఆలయాన్ని 11వ శతాబ్దంలో విక్రమాదిత్య రాజు నిర్మించాడని చారిత్రక కథనం. ఆ తర్వాత మొఘల పాలకులు అనేక సార్లు ఈ ఆలయాన్ని విచ్ఛిన్నం చేశారు. తరువాత కాశి విశ్వనాథుడి ఆలయం  పునర్నిర్మించబడింది.
  3. ఈ ఆలయం ప్రస్తుత రూపం ఇండోర్‌కు చెందిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ చేత నిర్మించబడిందని తెలుస్తోంది. ఈ ఆలయం ఇటీవల విస్తరించబడింది. చాలా అందంగా ఉంది.
  4. విశ్వనాథుడు పవిత్ర నివాసం  రక్షణను కాశీ కొత్వాల్ అని పిలవబడే కాల భైరవుడు స్వయంగా చేపట్టినట్లు పురాణాల కథనం. కనుక కాశి విశ్వేశ్వరుడిని దర్శించుకున్న కాలభైరవుడియం దర్శించుకోనట్లు అయితే ఆ యాత్ర. ఈ  జ్యోతిర్లింగ ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. బాబా విశ్వనాథుని దర్శనానికి ముందు భైరవుని దర్శనం చేసుకోవాలని భక్తుల నమ్మకం.
  5. ఇవి కూడా చదవండి
  6. ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ శక్తి కూడా ఏదో ఒక రూపంలో నివసిస్తుందని నమ్ముతారు. కాశీలో జ్యోతిర్లింగమే కాదు శక్తిపీఠం కూడా ఉంది.  దేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటైన విశాలాక్షి అమ్మవారి ఆలయం కాశీవిశ్వనాథుడి ఆలయానికి సమీపంలో ఉంది. ఇక్కడ సతీదేవి భాగాలు పడినట్లు పురాణాల కథనం.
  7. కాశీ విశ్వనాథ ఆలయ గోపురంలో ప్రతిష్టించిన శ్రీయంత్రాన్ని దర్శించి విశ్వనాథుడి ఎవరు ప్రార్థిస్తారో.. అటువంటి భక్తుల కోరిన కోర్కెలు శివుడు  త్వరగా నెరవేరుస్తాడని నమ్మకం.
  8. కాశీ విశ్వనాథ ఆలయ పూజకు సంబంధించి..  ఏ శివభక్తుడైనా ఇక్కడ విశ్వనాథుని జ్యోతిర్లింగాన్ని తాకి, పూజలు చేసినా.. రాజసూయ యాగం చేసిన పుణ్యఫలం పొందుతారని నమ్మకం.
  9. గంగానది ఉత్తర వాహిని అయిన ఏకైక ప్రదేశం కాశీ. ఇక్కడ గంగానదికి సంబంధించిన అనేక ఘాట్‌లు ఉన్నాయి. కాశీలో ప్రవహిస్తున్న గంగామాత,    పవిత్ర ఘట్టాలను దర్శించుకోవడానికి ప్రపంచం  నలుమూలల నుండి ప్రజలు ప్రతిరోజూ భక్తులు చేరుకుంటారు.
  10. మహాదేవుని నగరం కాశీ నగరంలో చివరి ప్రాణాలు విడిచిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం. కాశీలో నివసించే భక్తుడికి తారక మంత్రాన్ని ఇవ్వడం ద్వారా శివుడు స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడని పురాణాల కథనం. జీవితంలో చివరి దశలో కాశీ నగరంలో స్థిరపడాలని చాలా మంది కోరుకుంటారు.
  11. పవిత్రమైన , పురాతనమైన కాశీ నగరంలో ప్రతి అణువులోను శివుడు ఉంటాడని నమ్ముతారు. ఇక్కడ 30 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారని పురాణాలు పేర్కొన్నాయి. అందుకనే బనారస్‌ను దేవాలయాల నగరం అని పిలుస్తారు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం పై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)