Telangana: తెలంగాణలో బోనాల సందడి.. పట్నమంత పండుగ సంబురం.. జాతర చూడాల్సిందే..

పోతురాజుల కోలాహలం, శివశక్తుల పూనకంతో సరికొత్త ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తున్నారు భక్తులు. జగదాంబిక అమ్మవారి ఆశీస్సులు

Telangana: తెలంగాణలో బోనాల సందడి.. పట్నమంత పండుగ సంబురం.. జాతర చూడాల్సిందే..
Ashadam Golconda Bonalu
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 15, 2022 | 8:59 AM

ఆషాఢ మాసంలో తెలంగాణ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం బోనాల జాతరతో భక్తుల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక అమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి తరలివస్తోన్న భక్తజనం, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహిళలే కాదు, చిన్నారులు తలపై బోనం ఎత్తుకుని జగదాంబిక చెంతకు వస్తున్నారు. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో గోల్కొండ పరిసరాలు మార్మోగుతున్నాయి. గోల్కొండ కోట ముఖ ద్వారం నుంచి కోటపై ఉండే జగదాంబిక ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్తున్నారు భక్తులు.

హైదరాబాద్‌ నుంచే కాకుండా తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎల్లమ్మ జగదాంబ అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. పోతురాజుల కోలాహలం, శివశక్తుల పూనకంతో సరికొత్త ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తున్నారు భక్తులు. జగదాంబిక అమ్మవారి ఆశీస్సులు తమపై ఎప్పటికీ ఉండాలని, తమ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారిని దర్శించుకుంటోన్న భక్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గోల్కొండ బోనాల ఏర్పాట్లు బాగున్నాయంటూ మెచ్చుకుంటున్నారు. ఈసారి అరేంజ్‌మెంట్స్‌ చక్కగా చేశారంటూ అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు భక్తులు. ఇక, జులై 17నుంచి సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభంకానున్నాయ్‌. అలాగే, హైదరాబాద్‌ అంతటా జులై 24, 25 తేదీల్లో బోనాలు జరగనున్నాయి.

ఈనెల 17వ తేదీన జరిగే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా బోనాలు జాతర నిర్వహించుకోలేదని, ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భారీ ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!