Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR : శాంతించు గంగమ్మ తల్లి.. ఎగువ మానేరు వద్ద మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక పూజలు

వరద ముంపు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్..

Minister KTR : శాంతించు గంగమ్మ తల్లి.. ఎగువ మానేరు వద్ద మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక పూజలు
Ktr
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 15, 2022 | 7:57 AM

Minister KTR : రుతుపవనాల ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ తెలంగాణ అంతటా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు,కుంటలు మత్తడి దూకుతున్నాయి. వరద ముంపు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ వరద పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లాలోని గంభిరావుపేట మండలం ఎగువ మానేరు జలాశయాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముందు జాగ్రత్త చర్యలపై సిరిసిల్ల జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులకు ఈ సందర్భంగా సూచించారు మంత్రి కేటీఆర్‌. ముఖ్యంగా సందర్శకులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగు నీటి సరఫరా అవసరమైతే అదనంగా ల్యాబ్ లు ఏర్పాటు చేసి నీటిని పరీక్షించి ఆ తర్వాతే ప్రజలకు సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ముందు చూపుతో సిరిసిల్ల పట్టణంలో ముంపు లేకుండా చూశారన్నారు. ప్రాజెక్ట్ ల వద్ద ప్రజలు, పిల్లలను నియంత్రించాలని, పోలీసు పికెట్ లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

పాల్వంచ వాగు, కుడెళ్లి వాగుల వరద ప్రవాహంతో జలకళ సంతరించుకున్న ఎగువ మానేరు జలాశయం వద్ద రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఎగువ మానేరు మత్తడి పోస్తున్న దృష్ట్యా సందర్శకుల తాకిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా యంత్రాంగం తరపున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించి, అధికారులకు పలు సూచనలు చేశారు. మత్తడి పోస్తున్న నర్మాల జలాశయాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్‌ గంగమ్మ తల్లిని శాంతించమని మొక్కుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి