Simhachalam: అప్పన్న గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు.. విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు.. బీచ్ రోడ్డులో భక్తుల సందడి

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి గిరిప్రదక్షిణ భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వేభవ౦గా కొనసాగుతోంది. విశాఖ పురవీదులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. వర్షాలు, భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 8గ౦.ల నుండే పలువురు భక్తులు గిరిప్రదక్షిణ మొదలుపెట్టారు. గిరిప్రదక్షిణ చేసేందుకు రాత్రి పది గంటల వరకూ సింహాచలానికి భక్తులు తరలివచ్చారు.

Simhachalam: అప్పన్న గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు.. విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు.. బీచ్ రోడ్డులో భక్తుల సందడి
Giri Pradakshana At Simhach
Follow us
Surya Kala

|

Updated on: Jul 13, 2022 | 8:41 AM

Simhachalam: రెండేళ్ల విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(Varaha Lakshami Narasimha Swami) వారి గిరిప్రదక్షిణకు భక్తుల నుంచి విశేష స్పందన లభి౦చింది. విశిష్టతను సంతరించుకున్న గిరి ప్రదక్షిణకు(Giri Pradaskhana) భక్తులు రాత్రి పది గ౦టల వరకు సింహాచలంకి తరలివస్తువచ్చారు. అధికారికంగా మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి పుష్ప రథం సింహాచలం తొలిపావంచా నుంచి బయలుదేరింది . కానీ ఉదయం నుంచే భక్తులు ప్రదక్షిణ ప్రారంభించారు.సింహాచలం తొలిపావంచా నుంచి అడివివరం, ముడసర్లోవ, హనుమంతువాక, విశాలాక్షినగర్, అప్పుఘర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, ఎన్ఏడీ కూడలి, గోపాలపట్నం బంకు, ప్రహ్లాదపురం మీదుగా 32కి.మీ.లు గిరి ప్రదక్షిణ కొనసాగింది. తొలి పావంచా దగ్గర సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. గిరిప్రదక్షిణతో సింహగిరి సమీపంలోని అడివివరం గ్రామంలో భక్తుల సందడి నెలకొంది. మరోవైపు విశాఖనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసారు.

గిరిప్రదక్షిణ మార్గంలో వాహనాలను అనుమతించకుండా నగర పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచి౦చారు. భారీ వాహనాల నగరంలోకి రాకుండా సోమవారం రాత్రి నుంచే చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత గిరిప్రదక్షిణకు అధికారులు అనుమతి ఇవ్వడంతో లక్షల మంది భక్తులు తరలివచ్చారు. అధికారికంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు గిరి ప్రదక్షిణ కొనసాగనుంది. దీనికోసం 2వేలకు పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. త్రాగునీరు, మ౦దులు అ౦దుబాటులో ఉంచుతూ దాదాపు 300స్టాల్స్ ని అధికారు ఏర్పాటు చేసారు.

ఇక అధికారులు ఏర్పాట్లు ఓవైపైతే స్వచ్ఛంద సంస్థలు హిందూ సంఘాల సేవా కార్యక్రమాలు మరోవైపు గా నిలిచాయి. 32 కిలోమీటర్ల మేర సాగిన గిరిప్రదక్షిణలో ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ, పాలు, శీతల పానీయాలు , పులిహారా, ఫ్రైడ్ రైస్, బిస్కెట్స్ ,చాక్లెట్స్, ఫలహారాలను అందిస్తూ స్థానికులు స్వచ్ఛంద సంస్థలు కౌంటర్లు ఏర్పాటు చేశాయి. భక్తులకు విశేష సేవలందించాయి. ఈ సేవలు లో మేము సైతమంటూ విశాఖ సెంట్రల్ జైలు ఖైదీలు సైతం పాల్గొన్నారు. సెంట్రల్ జైలు వద్ద రోడ్డుపై భక్తుల కోసం ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి పులిహోరా, ఫ్రైడ్ రైస్, బఠాణీలు, మంచినీరు అందించి భక్తుల సేవలో తరించారు. జైళ్ల శాఖ అధికారుల పర్యవేక్షణలో తామే స్వయంగా వండి వడ్డించారు.

ఇవి కూడా చదవండి

గిరి ప్రదక్షిణలో భాగంగానే సముద్ర స్నానాలు చేయాలనుకునే భక్తులకు ఉడా పార్క్ వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ముప్పై మంది స్విమ్మర్లను అందుబాటులో ఉంచారు. బీచ్ రోడ్డులో సైతం భక్తులు సందడి నెలకొంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..