Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.. నేడు గురువుని పూజించి సత్కరించే శిష్యులు

తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. మంత్రాలయం సహా అనేక సాయిబాబా దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.

Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.. నేడు గురువుని పూజించి సత్కరించే శిష్యులు
Guru Purnima Celebration
Follow us

|

Updated on: Jul 13, 2022 | 8:40 AM

Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా.. లెక్కచేయకుండా తెల్లవారు జామునుంచే అనేక ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. మంత్రాలయం సహా అనేక సాయిబాబా దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మంత్రాలయంలో గురుపౌర్ణమి వేడుకలు తులసివనంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. షిరిడి లోని సాయిబాబా ఆలయంలో కూడా గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

అటు బాసర, హైదరాబాద్‌ లోని దిల్‌సుఖ్‌నగర్‌, పంజాగుట్ట సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. బాబాను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. గురుపౌర్ణమి సందర్భంగా దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట సాయిబాబా ఆలయం ప్రత్యేక పుష్పాలతో, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పలు ఆలయాల్లో సాధారణ భక్తులు మొదలుకొని, వివిఐపిల వరకు బాబాను దర్శించుకుంటున్నారు. బాబాను దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది.

హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి లేదా వ్యాసపౌర్ణమిని జరుపుకుంటారు. వ్యాసమహాముని పుట్టిన రోజు కావున ఈ రోజుకింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈరోజు చదువు చెప్పే గురువును, మంత్రోపదేశం చేసిన గురువును యథోచితంగా సత్కరిస్తారు. గురువులోనే వ్యాసదేవుని భావించి అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. గురువులను, ఉపాధ్యాయులను తమకు అత్యంత ఇష్టమైన గురువుని పూజిస్తూ.. గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి సత్కరిస్తారు. గురువు నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.