Janasena: ఆ నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ ఉంది.. బాట వేసే లీడర్ లేడు.. అధిష్ఠానం ఫోకస్ పెట్టేదెప్పుడు
ఏపీలో రానున్న ఎలక్షన్ల హీట్ ఇప్పుడే మొదలైంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని చూస్తున్న జనసేన పై అందరి దృష్టి ఉంది ఇప్పుడు.. బలమైన ఓటు బ్యాంక్ ఉన్నా.. దానిని గెలుపుదిశగా మార్చే నాయకత్వం లోపం కనిపిస్తుందని పొలిటికల్ విశ్లేషకుల మాట
Janasena: అవనిగడ్డ (Avanigadda) ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా(Krishna District) రాజకీయాలకు పురిటిగడ్డ..ఎంతో మంది ఉద్దండులైన రాజకీయ ప్రముఖులను రాష్ట్రానికి అందించిన అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పుడు పొలిటికల్ సీన్ ఎలా ఉంది? ముక్కోణపు వార్ ఎవరికి కలసి వస్తుంది? గత ఎన్నికల్లో 30 వేల ఓట్లకు చేరలేకపోయిన జనసేన స్థానం ఈ సారి ఎక్కడ? ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో ఇది ఓ హాట్ టాపిక్.. మూడో ప్రత్యామ్నాయంగా దూసుకువచ్చిన జనసేనకు బలం ఉన్న నియోజకవర్గంగా దీనికి పేరుండడమే అందుకు కారణం.
జనసేన పార్టీకి ప్రధాన బలం బుల్లెట్ల లాంటి జనసైనికులు..కానీ వాటిని కాల్చే తుపాకులు..అంటే నాయకులు కరువయ్యారన్నది పొలిటికల్ సత్యం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లో మాత్రం సీన్ రివర్స్ అనే చెప్పలి. ఇక్కడ మాత్రం బుల్లెట్ల కంటే తుపాకులు ఎక్కువ. స్థానిక నాయకుల మధ్య సఖ్యత లేమితో గందరగోళంలో జనసైనికులు ఉన్నారు. ఒక లీడర్ కోసం ఎదురు చూస్తున్నరు జనసైనికులు. పార్టీ అధిష్టానం పరిష్కారంపై దృష్టి సారించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయానికి గురిచేస్తుంది.
గత ఎన్నికల్లో స్థానికేతర అభ్యర్ధి.. వైసీపీ గాలి.. తదితర కారణాలతో జనసేన మూడో స్థానానికి పరిమితం అయినా.. ఈ సారి ఖచ్చితంగా సీటు కొట్టేస్తామన్న నమ్మకం అక్కడి నాయకత్వంలో ఉంది. అయితే ఆ గెలుపుకు అవసరమైన వ్యూహాలను జనసేన ఎంత వరకు అమలు చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇద్దరు రాజకీయ ఉద్దండులైన ప్రత్యర్ధులను ఢీ కొట్టే స్థాయి నాయకులు జనసేనకు ఉన్నారా అన్నదే సమస్య.
నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలంగా కాచుకునే ఇంఛార్జ్ లేకపోవడం.. ఉన్న ద్వితియశ్రేణి నాయకత్వం అంతా ఆ పదవి కోసం పోటీ పడే పనిలో బిజీగా ఉండి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని మర్చిపోవడం వంటి అంశాలు ఈ సారి జనసేన విజయంపై ప్రభావితం చూపబోతున్నాయి.. ఉన్న నాయకులకు తోడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బండ్రెడ్డి రామకృష్ణ ఈ మధ్య కాలంలో ఇక్కడ సొంత కార్యాలయం తెరిచి కొత్త చర్చకు తెరతీశారు.
ఇలాంటి చర్చలన్నింటికీ తెరదించాల్సిన బాధ్యత జనసేన అధినాయకత్వం మీదే ఉంది. బలమైన ప్రత్యర్ధుల్ని బలమైన ఓటు బ్యాంకుతో కొట్టగల సత్తా ఉన్నా.. దాన్ని ముందుకు తీసుకువెళ్లే స్థాయి నాయకత్వం అవనిగడ్డలో జనసేనకు లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఆ నాయకత్వ లోపాన్ని జనసేన ఎలా అధిమిస్తుందో వేచి చూడాలి మరి.
Reporter: Vikram, TV9 Telugu
మరిన్ని పొలిటికల్ విశ్లేషణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..