Shravana Masam 2022: శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటున్నారా.. అయితే వీటిని మీ డైట్ లో చేర్చుకోండి..

ఉపవాసం ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు శివయ్యకు ఉపవాసం ఉన్న సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం.. 

Shravana Masam 2022: శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటున్నారా.. అయితే వీటిని మీ డైట్ లో చేర్చుకోండి..
Shravana Masam
Follow us

|

Updated on: Jul 21, 2022 | 5:37 PM

Shravana Masam 2022: శివుడిని కార్తీక మాసంలోనే మాత్రమే కాదు.. శ్రావణ మాసంలో కూడా ఆరాధించడం శుభఫలితాలను కలిగిస్తుంది. ఈ పవిత్ర మాసంలో ఆదిదంపతులు శివపార్వతులను కలిపి పూజిస్తారు. ఈ మాసం లో కొందరు ప్రతిరోజూ శివునికి జలాభిషేకం చేస్తారు. అదే విధంగా, ఈ నెలలో ప్రతి సోమవారం ఉపవాసం చేస్తారు, అయితే ఉపాసవ సమయంలో ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా సాత్వికాహారాన్ని తీసుకోవచ్చు. ఉపవాసం  ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది శ్రావణ మాసం జులై 29 నుంచి ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఈరోజు శివయ్యకు ఉపవాసం ఉన్న సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం..

తాజా పండ్లు ఉపవాసంలో ఖాళీ కడుపుతో ఉండి భగవంతుడిని పూజించాలనే నిబంధన ఉంది.  కానీ మారుతున్న కాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కనుక ఉపవాసం చేయడం వల్ల శరీరంలో పోషకాల కొరత ఏర్పడి బలహీనత లేదా కళ్లు తిరగడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో..  తాజా పండ్లను తినాలి. ఇవి శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి. శక్తిని ఇస్తాయి. కనుక శివయ్యని పూజిస్తూ ఉపవాసం ఉండేవారు  సీజనల్ పండ్లను తీసుకోవచ్చు.

సలాడ్ తినండి ఉపవాసం సమయంలో శరీరం లోపల శక్తిని అందించడానికి ఆహారంగా సలాడ్‌ను తీసుకోవచ్చు. సలాడ్‌లో దోసకాయ, టొమాటోలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఈ రెండూ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సలాడ్ తినడం వల్ల ఆకలి వేయదు. దీంతో పాటు శరీరంలో నీటి కొరత కూడా తీరుతుంది.

ఇవి కూడా చదవండి

డ్రై ఫ్రూట్స్ ఉపవాసంలో ఆహారం, ఉప్పు పదార్థాలను తినడం నిషేధం కనుక ఉపవాస సమయంలో డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంగా తినడం ఉత్తమం. డ్రై ఫ్రూట్స్  కడుపు నింపడంతో పాటు పోషణను అందిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌ను పరిమితంగా తీసుకోవాలి. అతిగా తినడం వల్ల తలనొప్పి లేదా గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం పై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)