- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu: these 4 mistakes spoil all your hard work if you want success be aware of these mistakes
Chanakya Niti: చేపట్టిన పనిలో సక్సెస్ సొంతం కావాలంటే.. ఈ 4 తప్పులు చేయకండి అంటున్న చాణక్య
Chanakya Niti: జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మనం చేసే తప్పులు మనకు తెలియకుండానే విజయానికి అడ్డంకిగా నిలుస్తాయి. ఈ వైఫల్యానికి కారణం అదృష్టం అంటూ కారణాలు వెదుకు కుంటాం.. ఎవరైనా సక్సెస్ ను సొంతం చేసుకోవాలంటే.. ఈ తప్పులను చేయకండి అని చాణక్య అంటున్నారు.
Updated on: Jul 21, 2022 | 4:23 PM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలను గురించి చెప్పాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. మానవ జీవితాన్ని నరకంగా మార్చే చాణక్య నీతిలో ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఆ సంఘటనలు ఏంటో తెలుసుకుందాం.

ఎవరైనా మీ లోపాలను పదే పదే బయటపెట్టి మిమ్మల్ని తగ్గించాలనుకుని కోరుకుంటే, అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తిని ఉన్నతంగా చూపించండి. దీనితో మీరు అతన్ని ఎక్కువగా చేసి చూపిస్తూ.. అతడిని తక్కువ చేసి చూపించవచ్చు. దీని వల్ల ఎదుటి వ్యక్తి మీలో తప్పులు కనిపెట్టాలని చాలాసార్లు ఆలోచిస్తారు.

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో సంపద, ఆస్తికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పాడు. తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఎప్పుడూ ఆ వ్యక్తి వద్ద ఉండదని నీతిశాస్త్రంలో పేర్కొన్నారు.

నెపం చూపడం మానుకోండి: ప్రేమలో ఎలాంటి నెపం ఉండకూడదు. ప్రేమను జీవిత భాగస్వామికి తెలియజెడానికి ఏకైక మార్గం.. స్వచ్ఛత అని చాణక్య చెప్పాడు. స్వార్ధం కంటే.. ప్రేమకు మనిషి లొంగిపోతాడు.

మోసం చేయడం ద్వారా - ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మోసం చేసి సంపాదించిన డబ్బు ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడూ నిలబడదు. ఎంత ధనం, సిరి సంపదలున్నా అలాంటి వ్యక్తులను.. ఆ ఇంటి కుటుంబ సభ్యులను ఎవరూ గౌరవించరు





























