Mosquitos in Monsoon: ఈ వర్షాకాలంలో దోమల నుండి ఉపశమనం కోసం ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోండి..

మన చుట్టూ ఉండే వాతావరణాన్ని శుభ్రపరిచేందుకు కొన్ని మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కలను బాల్కనీలో లేదా, గార్డెన్ లో పెంచుకోవడం వలన ఇంట్లోకి దోమలు రాకుండా చాలా వరకు సహాయపడతాయి. ఈరోజు అటువంటి మొక్కల గురించి తెలుసుకుందాం.. 

Mosquitos in Monsoon:  ఈ వర్షాకాలంలో దోమల నుండి ఉపశమనం కోసం ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోండి..
Mosquitos In Monsoon
Surya Kala

|

Jul 22, 2022 | 11:21 AM

Mosquitos in Monsoon: వర్షాకాలంలో దోమలు గణనీయంగా పెరుగుతాయి. దీనికి కారణం ఈ సీజన్‌లో గుంతల్లో నీరు నిల్వ ఉండడమే. అంతేకాదు మురికి నీరు ఒకచోట నుండి మరొక ప్రదేశానికి పారుతూనే ఉంటుంది. ఈ కారణాల వలన ఈ సీజన్ లో దోమలు వృద్ధి చెందుతాయి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు కూడా గణనీయంగా పెరుగుతుంది. కనుక వర్షాకాలంలో దోమల వృద్ధి చెందకుండా.. వాటి బారిన పడకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకనే చాలామంది దోమల నుండి రక్షణ కోసం స్ప్రేలు లేదా ఇతర రసాయనిక మందులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటి వలన చాలా మందికి అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే మన చుట్టూ ఉండే వాతావరణాన్ని శుభ్రపరిచేందుకు కొన్ని మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కలను బాల్కనీలో లేదా, గార్డెన్ లో పెంచుకోవడం వలన ఇంట్లోకి దోమలు రాకుండా చాలా వరకు సహాయపడతాయి. ఈరోజు అటువంటి మొక్కల గురించి తెలుసుకుందాం..

వేప: వేపను పురుగుమందుగా పరిగణిస్తారు. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ దోమలు, క్రిమికీటకాదులు తరిమి కొట్టడానికి వేప ఆకులను కాల్చి పొగబెట్టేవారు. అంతేకాదు వేపనూనెను కూడా ఉపయోగిస్తారు. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే డోర్ లేదా బాల్కనీలో వేప మొక్కను నాటండి. ఇంట్లో స్థలం సమస్య ఉంటే. ఇప్పుడు బోన్సాయ్ వంటి వేప మొక్కలు లభిస్తున్నాయి.

నిమ్మగడ్డి: ఈ మొక్క ఇది దోమలను తరిమికొట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నమ్మకం. ఈ నిమ్మగడ్డి నూనెను దోమల నివారణ క్రీములు,  రిపెల్లెంట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క డెంగ్యూని వ్యాప్తి చేసే దోమల నుండి రక్షించగలదని కూడా నమ్మకం. .

రోజ్మేరీ: ఈ మొక్క లు నర్సరీలో లభిస్తాయి. ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. ఈ మొక్కలో వచ్చే పువ్వుల వాసన ఘాటుగా ఉంటుంది. ఈ వాసనకు దోమలు పారిపోతాయి.  ఈ పువ్వులు ఇంట్లో పురుగుమందుగా కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడానికి ముందుగా పువ్వులను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టాలి.. అప్పుడు ఆ నీటిని పురుగులు రాకుండా చల్లాల్సి ఉంటుంది.

తులసి: ఈ మొక్కకు సనాతన హిందూ ధర్మంలో ప్రత్యేక విశిష్టత ఉంది. ఎక్కువమంది ఇంట్లో కనిపించే మొక్క. ఇంటి బాల్కనీ లేదా మెయిన్ డోర్ వంటి ప్రదేశాల్లో పెట్టుకోవచ్చు. ఆ స్థలాన్ని శుభ్రం చేయడంతోపాటు దోమలు ఇంట్లో రావడాన్ని నియంత్రిస్తుంది. తులసి మొక్క నుంచి వచ్చే స్మెల్ కారణంగా దోమలు ఇంటికి దూరంగా ఉంటాయి.

క్యాట్నిప్: పుదీనా ఆకులను పోలి ఉండే ఈ మొక్క ఎండలోనూ, నీడలోనూ బాగా పెరుగుతుంది. ఇది పురుగుమందు కంటే ఎక్కువ ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ఈ మొక్కను ఇంటి ప్రాంగణంలో, బాల్కనీలో అలాగే ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్క దోమల నుండి మాత్రమే కాదు.. ఇతర కీటకాలు, సాలెపురుగుల నుండి కూడా రక్షించడంలో సహాయపడుతుంది.

అజెరాటం: ఈ మొక్క క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కలు లేత నీలం, తెలుపు పువ్వులను కలిగి ఉంటుంది. ఈ పువ్వుల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఈ వాసన ప్రభావం వల్ల చుట్టుపక్కల దోమలు రావు. ఈ పువ్వులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఇంట్లో కూడా చల్లుకోవచ్చు.

(ఈ కథనంలో అందించిన సమాచారం ప్రేక్షకుల ఆసక్తిని అనుసరించి ఇచ్చింది.  TV9 తెలుగు  ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించాల్సి ఉంటుంది.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu