World Brain Day 2022: మీ పిల్లల మెదడుకు పదును పెట్టాలనుకుంటే ఈ సూపర్ ఫుడ్స్ తినిపించాల్సిందే..
Parenting Tips: మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మెదడు పనితీరు ఎంతో ముఖ్యం. అయితే నేటి యాంత్రిక జీవనంలో పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఈక్రమంలోనే మెదడుకు సంబంధించిన అన్ని సమస్యలపై
Parenting Tips: మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మెదడు పనితీరు ఎంతో ముఖ్యం. అయితే నేటి యాంత్రిక జీవనంలో పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఈక్రమంలోనే మెదడుకు సంబంధించిన అన్ని సమస్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా జులై 22న వరల్డ్ బ్రెయిన్ డేను జరుపుకుంటున్నారు. కాగా మొదటిసారిగా 2014లో వరల్డ్ బ్రైన్ డేను నిర్వహించారు. ఈ రోజున వివిధ అవగాహన కార్యక్రమాలు, ప్రోగ్రాములతో మెదడుకు సంబంధించిన అన్ని సమస్యలపై అవగాహన కల్పిస్తారు. ఇక పిల్లల ఎదుగుదలో మెదడు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలంటే మెదడు పదునుగా ఉండాల్సిందే. మరి ఇందుకోసం వారికి ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వాలో ఒకసారి తెలుసుకుందాం రండి.
చేపలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు మన మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇందుకోసం పలు ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ చేపలు వీటి ప్రధాన వనరులుగా భావిస్తారు. వారంలో కనీసం రెండుసార్లు పిల్లలకు చేపలు తినిపిస్తే వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది
గుడ్లు
ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లలో మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, లుటిన్, కోలిన్, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే పిల్లలకు ఆమ్లెట్‌కు బదులుగా ఉడికించిన గుడ్లు తినేలా అలవాటు చేయండి
ఓట్స్
ఈ రోజుల్లో దీన్ని హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌గా పరిగణిస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దలు ఈ సూపర్ ఫుడ్స్‌ను ఇష్టపడుతున్నారు. మెదడుకు పదును పెట్టడానికి పని చేసే అనేక పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. పిల్లల కోసం ఓట్ మీల్ గంజిని తయారు చేసి ఇవ్వచ్చు.
బాదం
మెదడు ఆరోగ్యంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అల్లోపతి నుంచి ఆయుర్వేదం వరకు నిపుణులు బాదంపప్పు మెదడుకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. అయితే పిల్లలైనా, పెద్దవారైనా, ఎప్పుడూ నానబెట్టిన బాదంపప్పులను మాత్రమే తినాలి
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..