Hair Care Tips: జుట్టు వర్షంలో తడిచి వాసన వస్తుందా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..
Monsoon Hair Care Tips: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. వాతావరణం కూడా బాగా చల్లబడింది. అయితే ఈ మార్పులు ఆరోగ్యంపైనే కాకుండా చర్మం, జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలు బాగా తలెత్తుతాయి.
Monsoon Hair Care Tips: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. వాతావరణం కూడా బాగా చల్లబడింది. అయితే ఈ మార్పులు ఆరోగ్యంపైనే కాకుండా చర్మం, జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలు బాగా తలెత్తుతాయి. ఈ సీజన్‌లో జుట్టు జిగటగా మారడం, వెంట్రుకలు రాలడం, చివర్లు చిట్లడం వంటి సమస్యలు బాగా చికాకు తెప్పిస్తాయి. అలాగే వర్షంలో తడిచినప్పుడు జుట్టు నుండి చెడు వాసన వస్తుంటుంది. వాతావరణంలో తేమ ఇందుకు ప్రధాన కారణం. ఒక్కోసారి షాంపూతో తలసాన్నం చేసినా ఆ వాసన పోదు. అయితే ఈ సింపుల్ చిట్కాలను అనుసరించడం ద్వారా నిమిషాల్లో ఈ వాసనను తొలగించవచ్చు.
టీట్రీ హెయిర్ ఆయిల్
మురికి, తేమ కలిసి జుట్టులో చుండ్రును కలిగిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడమే కాకుండా దుర్వాసన కూడా వస్తుంది. అయితే టీ ట్రీ ఆయిల్ సహాయంతో దీనిని తొలగించుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్‌లో ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టుకు బాగా పట్టించాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శిరోజాలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితముంటుంది.
నిమ్మ
వాతావరణంలో తేమ కారణంగా ఈ సీజన్‌లో జుట్టు జిగటగా మారుతుంది. దీనివల్ల శిరోజాల నుంచి వాసన వెలువడుతుంది. దీనిని నివారించడానికి పెరుగులో కాస్త నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తలలోని దురద, చుండ్రు కూడా మాయమైపోతాయి.
వెనిగర్
ఇందులో ఉండే యాసిడ్ జుట్టులోని వాసనను క్షణాల్లో దూరం చేస్తుంది. స్నానానికి ముందు, ఒక పాత్రలో నీటిని తీసుకుని, దానికి ఆపిల్ సైడర్ వెనిగర్‌ను జోడించండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి కొద్ది సేపటి షాంపూతో తలస్నానం చేయాలి.
టమోటా
ఒక్కోసారి తలలో బ్యాక్టీరియా పెరగడం వల్ల కూడా వాసన రావచ్చు. అయితే టమోటా రసంతో ఈ బ్యాక్టీరియాను తొలగించవచ్చు. టొమాటో రసాన్ని తీసుకుని నేరుగా జుట్టుకు పట్టించాలి. కొద్ది సేపటి తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే సరి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..