India vs West Indies: విండీస్ పర్యటనలో టీమిండియా శుభారంభం.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ధావన్ సేన సూపర్ విక్టరీ..
India vs West Indies 1st ODI: వెస్టిండీస్ పర్యటనను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా మూడు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. శిఖర్ ధావన్ (99 బంతుల్లో 97, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకోగా..
India vs West Indies 1st ODI: వెస్టిండీస్ పర్యటనను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా మూడు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. శిఖర్ ధావన్ (99 బంతుల్లో 97, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకోగా, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (64), శ్రేయస్ అయ్యర్ (54) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసింది భారత జట్టు. లక్ష్య ఛేదనలో విండీస్ చివరి వరకు పోరాడింది. ఓపెనర్ కైల్ మేయర్స్ (75), బ్రాండన్ కింగ్ (54) టీమిండియా బౌలర్లను ప్రతిఘటించాడు. చివర్లో రోమారియో షెపర్డ్ (25 బంతుల్లో 39 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అఖిల్ హోసిన్ (32 బంతుల్లో 33 నాటౌట్, 2 ఫోర్లు) భారత జట్టుకు చుక్కలు చూపించారు. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా సిరాజ్ కట్టుదిట్టంగా బంతులేయడంతో 11 రన్స్ మాత్రమే చేసింది. దీంతో మూడు పరుగుల తేడాతో ధావన్ సేన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చాహల్ తలా రెండేసి వికెట్లు తీశారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ధావన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
ఓపెనర్లు శుభారంభం అందించినా..
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కరేబియన్ బౌలర్లపై ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిన వీరు మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం జోడించారు. శుభ్‌మన్ రనౌటైనా శ్రేయస్‌తో కలిసి రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించాడు ధావన్. అయితే త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. టాపార్డర్ బ్యాటర్ల జోరు చూస్తే ఒకనొక దశలో టీమిండియా స్కోరు 350 పరుగులు దాటేలా కనిపించింది. అయితే సూర్యకుమార్ యాదవ్ (13), సంజుశామ్సన్ (12), దీపక్ హుడా (27), అక్షర్ పటేల్ (21) నిరాశపర్చారు. చివర్లో కరేబియన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 308 పరుగులు చేయగలిగింది టీమిండియా. విండీస్ బౌలర్లలో జోసెఫ్, మోటీ తలా రెండు వికెట్లు తీశారు.
For his captain’s knock of 9⃣7⃣, @SDhawan25 bags the Player of the Match award as #TeamIndia seal a thrilling win over West Indies in the first ODI. ? ? #WIvIND
Scorecard ▶️ https://t.co/tE4PtTx1bd pic.twitter.com/YsM95hV4gD
— BCCI (@BCCI) July 22, 2022
కడవరకు పోరాడినా..
ఇక లక్ష్య ఛేదనలో విండీస్ కూడా బాగా పోరాడింది.5వ ఓవర్‌లో సిరాజ్ ఓపెనర్ షై హోప్ (7)ను ఔట్ చేసినా మరో ఓపెనర్ మేయర్స్, వన్‌డౌన్ బ్యాటర్ బ్రూక్స్ (46) ధాటిగా ఆడారు. రెండో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం అందించి తమ జట్టును మళ్లీ పోటీలోకి తెచ్చారు. అయితే శార్దూల్ స్వల్ప వ్యవధిలో వీరిని ఔట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆపై బ్రెండన్ కింగ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకన్నాడు. అయితే కెప్టెన్ పూరన్ (25), పావెల్ (6) త్వరగా ఔటవ్వడం విండీస్ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. చివర్లో రోమారియో షెపర్డ్, అఖిల్ హోసిన్ భారత బౌలర్లను భయపెట్టారు. అయితే తమ జట్టును ఓటమి నుంచి మాత్రం గట్టెక్కించలేకపోయారు. చివరి బంతి వరకు పోరాడిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 305 పరుగులు మాత్రమే చేసి 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది టీమిండియా. రెండో మ్యాచ్ ఆదివారం జరగనుంది.
మరిన్నిక్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..