Health Tips: మందులతో పనిలేదు.. బీపీని తగ్గించే ఏకైక మార్గం ఇదే! డాక్టర్ చెప్పిన సూపర్ టిప్
ఈ మధ్య కాలంలో పెరుగున్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో బీపీ కూడా ఒకటి. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు చాలా మంది అనేక మందులను ఉపయోగిస్తారు. కానీ పూర్తి పరిష్కారం పొందలేరు. అయితే బీపీ అనేది జీవనశైలి సంబంధమైన సమస్య అని, మన అలవాట్లు సరిగ్గా లేనప్పుడు అది మనల్ని హెచ్చరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనం కొన్ని అలవాట్లను మార్చుకుంటే బీపీని శాశ్వతంగా నియంత్రించవచ్చని, ఇది వైద్యుల చేతుల్లో కాకుండా వ్యక్తి తన చేతుల్లోనే ఉందని అంటున్నారు. కాబట్టి బీపీఎలా తగ్గించుకోవాలో చూద్దాం

ఉప్పు రక్తపోటుకు ప్రధాన శత్రువు. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తనాళాల గోడల చుట్టూ పేరుకుపోయి, వాటిని గట్టిపరుస్తుంది, సాగే గుణాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల రక్తనాళాలు ఇరుకైపోతాయి. ఇరుకైన మార్గంలో రక్తాన్ని పంప్ చేయడానికి గుండెకి చాలా కష్టంగా ఉంటుంది. తర్వాదా గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది. కాబట్టి మీకు బీపీ రీడింగ్ పెరుగుతుందటే రక్తనాళాల సాగే గుణం తగ్గుతున్నదని అర్థం. అందువల్ల, ఉప్పును తగ్గించడం లేదా నివారించడం ద్వారా బీపీని కంట్రోల్ చేయవచ్చు. నూటికి 80-90 మంది ఉప్పు మానేయడం ద్వారా బీపీని మందులు లేకుండానే సాధారణ స్థితికి తీసుకురావచ్చు. మిగిలిన 10-20 శాతం మందికి మానసిక ఒత్తిడి, వంశపారంపర్య కారణాలు, గుండె లేదా కిడ్నీ సమస్యల వంటి ఇతర కారణాలు ఉండవచ్చు.
రక్తపోటు నియంత్రణకు సహజ ఆహారాలు అత్యంత మేలు చేస్తాయి. పండ్లు, కూరగాయలు, సలాడ్లు, మొలకలు, డ్రై ఫ్రూట్స్ రక్తానికి చాలా మంచివి. ఇవి రక్తాన్ని పల్చగా ఉంచి, రక్తనాళాలను మృదువుగా చేస్తాయి. ముఖ్యంగా పొటాషియం అధికంగా ఉన్న పండ్లు, ఆహారాలు బీపీ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే పోటాషియం రక్తనాళాల ఎలాస్టిసిటీని పెంచుతుంది. పండ్ల తొక్కల్లో, కూరగాయల తొక్కల్లో, లోపలి భాగాల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వాటిని ఉడికించి తింటే వాటిలో ఉన్న పొటాషియం పోతుంది, కాబట్టి పచ్చిగా తీసుకోవడం ఉత్తమం. ఇవేకాదు నైట్రేట్లు కలిగిన ఆహారాలు కూడా మంచివి. బీట్‌రూట్‌లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలను విశ్రాంతి పరుస్తాయి, తద్వారా రక్తపోటు తగ్గుతుంది.
బీపీని తగ్గించే ఆహారపు అలవాట్లు:
రైస్ తక్కువ తీసుకోవడం: ఎక్కువ సార్లు వండిన ఆహారాన్ని తినడం ద్వారా ఉప్పు ఎక్కువగా శరీరంలోకి చేరుతుంది. వండిన ఆహారాన్ని ఒకేసారి తక్కువ మొత్తంలో తీసుకోవాలని నియమం పెట్టుకోవాలి. ఉదయం బీట్‌రూట్, క్యారెట్, టమాటాలు కలిపిన జ్యూస్ (200 మి.లీ), సలాడ్లు, మొలకలు, పండ్లతో అల్పాహారం చేయడం వల్ల పొటాషియం, నైట్రిక్ ఆక్సైడ్ శరీరానికి అంది రక్తం పల్చగా మారుతుంది.
ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం:
ప్రాణాయామం, ధ్యానం: రోజుకు 15 నిమిషాలు కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామాలు చేసి, ఆ తర్వాత 10-15 నిమిషాలు కళ్ళు మూసుకుని శ్వాసపై ధ్యాస పెడితే అధిక బీపీ తక్షణమే సాధారణ స్థాయికి వస్తుంది.
వ్యాయామం: రాత్రి భోజనం తర్వాత అరగంట నుంచి గంట వాకింగ్ చేయడం బీపీ ఉన్నవారికి మంచిది. నడవడం వల్ల రక్త ప్రసరణ పెరిగి రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఉదయం పూట సూర్య నమస్కారాలు, ఆసనాలు వంటి వ్యాయామాలు అరగంట నుంచి గంట పాటు అభ్యాసం చేయడం శ్రేయస్కరం.
పైన పేర్కొన్నా ఈ మూడు ఆహార నియమాలు, వ్యాయామం, ధ్యాన్యాన్ని మీ జీవనశైలిలో భాగం చేసుకుంటే మీరు బీపీని మందులు లేకుండానే అదుపులోకి తెచ్చుకోవచ్చు. బీపీని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఎటువంటి లక్షణాలు లేకుండానే హార్ట్ ఎటాక్‌లు, బ్రెయిన్ హెమరేజ్‌లకు దారితీస్తుంది. కాబట్టి 15 ఏళ్లు పైబడిన వారు, టీనేజ్‌లు కూడా ప్రతి రెండు-మూడు నెలలకు ఒకసారి బీపీని పరీక్షించుకోవడం, కుటుంబం మొత్తం ఈ విషయంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
