IND vs WI: ధావన్ దంచి కొట్టినా అతనే అసలైన హీరో.. సూపర్ స్పెల్‌తో టీమిండియాను గెలిపించిన హైదరాబాదీ బౌలర్..
India vs West Indies 1st ODI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. విజయం కోసం ఇరు జట్లు తుదివరకు పోరాడాయి. అయితే టీమిండియా ముందు ఆతిథ్య జట్టు నిలవలేకపోయింది. థ్రిల్లింగ్ పోరులో కేవలం 3 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ..
India vs West Indies 1st ODI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. విజయం కోసం ఇరు జట్లు తుదివరకు పోరాడాయి. అయితే టీమిండియా ముందు ఆతిథ్య జట్టు నిలవలేకపోయింది. థ్రిల్లింగ్ పోరులో కేవలం 3 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో భారత జట్టు భారీస్కోరుకు బాటలు వేసిన శిఖర్ ధావన్ (Shikar Dhawan) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ఈ మ్యాచ్‌లో అతను 97 పరుగులు సాధించి త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో మరో అన్‌సీన్ హీరో ఉన్నాడు. అతనే హైదరాబాదీ బౌలర్ మహ్మాద్ సిరాజ్ (Mohammed Siraj). ఈ మ్యాచ్‌లో 10 ఓవర్ల కోటా పూర్తి చేసిన అతను 57 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. భారీగా పరుగులిచ్చినప్పటికీ తన చివరి 2 ఓవర్లను అద్భుతంగా వేశాడు సిరాజ్. యార్కర్ల వేస్తూ కరేబియన్ ఆటగాళ్లను పరుగులు చేయకుండా కట్టడి చేశాడు. అతని సూపర్ స్పెల్‌తోనే టీమిండియా విజయం సాధించనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
యార్కర్లు సంధిస్తూ..
కాగా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి విజయానికి చేరువలో నిలిచింది. చివరి18 బంతుల్లో 38 పరుగులు చేయాల్సి ఉండగా సిరాజ్ బౌలింగ్‌కు దిగాడు. వరుస యార్కర్లతో విండీస్ బౌలర్లపై దాడి చేశాడు. దీంతో ఈ ఓవర్ తర్వాత విండీస్ విజయ సమీకరం 12 బంతుల్లో 27 రన్స్‌గా మారిపోయింది. ఇక 49వ ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 12 పరుగులివ్వడంతో చివరి ఓవర్‌లో విండీస్ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. మరోసారి బంతిని అందుకున్న సిరాజ్ మాయ చేశాడు. ఎప్పటిలాగే తన ట్రేడ్ మార్క్ యార్కర్లను వేస్తూ విండీస్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడకుండా అడ్డుకన్నాడు. చివరి ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో రెండు పరుగులు రాగా, షెపర్డ్ ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టాడు. ఐదో బంతి వైడ్ కాగా, తర్వాతి బంతికి వెస్టిండీస్ ఖాతాలో రెండు పరుగులు వచ్చాయి. మ్యాచ్ సూపర్ ఓవర్‌లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు అనిపించినా సిరాజ్ చివరి బంతికి ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. తద్వారా టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.
Some brilliant death bowling from Mohammed Siraj and an impressive spell from Yuzvendra Chahal powered India to a close 3-run win in the first ODI vs West Indies ???#MohammedSiraj #India #WIvsIND #Cricket #ODIs pic.twitter.com/ubqU2n7WkN
— Wisden India (@WisdenIndia) July 22, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..