Murali Vijay: డీకే, డీకే అంటూ ఫ్యాన్స్ నినాదాలు.. వద్దంటూ దండం పెట్టిన మురళీ విజయ్.. వైరల్ అవుతున్న వీడియో.
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ చాలా కాలం తర్వాత ఇటీవల క్రికెట్ మైదానంలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో బ్యాట్‌తో సత్తా చాటుతున్నాడు.
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ చాలా కాలం తర్వాత ఇటీవల క్రికెట్ మైదానంలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో బ్యాట్‌తో సత్తా చాటుతున్నాడు. అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. లైవ్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. TNPL మ్యాచ్ సమయంలో మురళీ విజయ్ ఫీల్డింగ్ చేసేందుకు వచ్చాడు. దీంతో అభిమానులు మురళీ విజయ్‌ను ఆటపట్టించేందుకు DK-DK అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇబ్బందిగా ఫీలైన మురళీ విజయ్.. అభిమానులకు చేతులు జోడించి మరీ దండం పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మురళీ విజయ్ ముందు దినేష్ కార్తీక్ పేరును ఎందుకు పిలిచారో తెలుసా? దినేష్ కార్తీక్ మొదటి భార్య నికితను మురళీ విజయ్ పెళ్లాడాడు. మురళీ విజయ్‌తో సన్నిహితంగా మెలిగిన తర్వాతనే విడాకులు తీసుకోవాలని దినేష్ కార్తీక్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ వివాదం చర్చనీయాంశం అయింది. దీంతో కార్తీక్ ఓ దశలో ఎంతో లోతుకు పడిపోయాడు. టీమిండియా నుంచి కూడా దూరమయ్యాడు. అనంతరం విడాకుల తర్వాత, కార్తీక్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ను వివాహం చేసుకున్నాడు. తాజాగా ఆమె కవలలకు తల్లి అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

