Watch Video: టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన విండీస్ దిగ్గజం.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం చేశాడంటే?
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో, శిఖర్ ధావన్ 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 64 పరుగులు చేశాడు.
వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా 3 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి, ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 308 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు కేవలం 305 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉత్కంఠ మ్యాచ్‌లో విజయం తర్వాత వెస్టిండీస్ మాజీ వెటరన్ ప్లేయర్ బ్రియాన్ లారా సందడి చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా ఆటగాళ్లను కలిశాడు. ఈమేరకు బీసీసీఐ ఓ వీడియోను ట్వీట్ చేసింది.
టీమిండియా విజయం తర్వాత లారా భారత ఆటగాళ్లను ఆప్యాయంగా కలిశారు. ఈ సమయంలో, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ ఈ వెస్టిండీస్ దిగ్గజంతో ప్రత్యేకంగా సంభాషించారు. వీరితోపాటు యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. టీమిండియా ఆటగాళ్ల కంటే ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా లారాను కలిశాడు.
Look who came visiting the #TeamIndia dressing room ? ?
The legendary Brian Charles Lara! ? ?#WIvIND | @BrianLara pic.twitter.com/ogjJkJ2m4q
— BCCI (@BCCI) July 23, 2022
Two Legends, One Frame! ? ?#TeamIndia | #WIvIND pic.twitter.com/CdCUj6Y2Rp
— BCCI (@BCCI) July 23, 2022
విశేషమేమిటంటే, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో, శిఖర్ ధావన్ 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 64 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత్ బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చాహల్ తలో రెండు వికెట్లు పడగొట్టి, భారత విజయాన్ని ఖాయం చేశారు.