India vs West Indies 2nd ODI Playing 11: సిరీస్ కైవసం చేసుకునేనా? విండీస్‌తో రెండో వన్డేకు సిద్ధమైన టీమిండియా..!

IND Vs WI Todays Match Prediction Squads: మొదటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించిన భారత్.. ప్రస్తుతం సిరీస్‌ను గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో రెండో వన్డేలో బరిలోకి దిగనుంది.

India vs West Indies 2nd ODI Playing 11: సిరీస్ కైవసం చేసుకునేనా? విండీస్‌తో రెండో వన్డేకు సిద్ధమైన టీమిండియా..!
India Vs West Indies 2nd Odi Playing 11
Follow us
Venkata Chari

|

Updated on: Jul 24, 2022 | 6:20 AM

తొలి వన్డేలో వెస్టిండీస్‌ను ఓడించిన భారత జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు చూపు రెండో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవడంపైనే నిలిచింది. ఈమేరకు ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసేందుకు వెస్టిండీస్ ప్రయత్నిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే వెస్టిండీస్‌ను సిరీస్‌ నుంచి దూరం చేస్తుంది. స్వదేశంలో ఈ అవమానాన్ని తప్పించుకోవాలని విండీస్ ఆరాటపడుతోంది. అయితే, తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా ప్రతి ఫీల్డ్‌లోనూ మెరుగ్గా రాణించడంతో రెండో వన్డేలో వెస్టిండీస్‌కు గెలుపు అంత సులభం కాదు. ఈ సిరీస్‌కు ముందు టీమిండియాతో వెస్టిండీస్‌కు గట్టిపోటీ తప్పదని భావించినా.. తొలి మ్యాచ్‌లో అది కుదరలేదు. వెస్టిండీస్ టీం చివరి వరకు పోరాడింది.

టీమిండియా సరికొత్త చరిత్ర..

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో జట్టు ఈ పని చేస్తే, చరిత్ర నెలకొల్పనుంది. ఈ సిరీస్‌లో చాలా మంది వెటరన్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు. తొలి మ్యాచ్‌లో అంతా సవ్యంగా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో వన్డేలో టీమిండియా మార్పులు చేస్తుందా? తొలి మ్యాచ్‌లో జట్టు కనబర్చిన ఆట తీరు చూస్తుంటే ధావన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్లేయింగ్-11లో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. చాలా కాలం తర్వాత శుభ్‌మన్ గిల్‌కు జట్టులో అవకాశం లభించింది. అతను హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ సిరీస్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ధావన్, అయ్యర్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.

ఇవి కూడా చదవండి

రవీంద్ర జడేజా గాయపడటంతో తొలి మ్యాచ్‌లో ఆడలేదు. తొలి రెండు మ్యాచ్‌లకు అతడు దూరమైనట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి జడేజా లేకుండానే టీమ్ ఇండియా కనిపించనుంది.

విండీస్ ప్లేయింగ్-11 మారనుందా?

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోనట్లే. టీమిండియాకు చివరిదాకా ఇబ్బందిని కలిగించింది. బౌలింగ్‌లో చివరి ఓవర్లలో బాగా బౌలింగ్ చేసి టీమిండియాను భారీ స్కోరు చేయకుండా ఆపేశారు. మ్యాచ్‌ను చివరి ఓవర్ దాకా తీసుకెళ్లారు. కెప్టెన్ నికోలస్ పూరన్, కోచ్ ఫిల్ సిమన్స్ మొదటి మ్యాచ్ తర్వాత తమ ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ కోణంలో, జట్టు ప్లేయింగ్-11లో మార్పుపై ఆశ లేదు.

రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు..

వెస్టిండీస్: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోయ్, షమ్రా బ్రూక్స్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, రోవ్‌మన్ పావెల్, జాడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్, గుడ్కేశ్ మోతీ, అకిల్ హొస్సేన్.

భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (కీపర్), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్