Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: ఆ విషయంలో ఆటగాళ్లకు భారీ షాక్.. సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో చెక్ పెట్టనున్న బీసీసీఐ.. అదేంటంటే?

బీసీసీఐ ఆధ్వర్యంలో ఇదివరకు నిర్వహించిన టోర్నీల్లో వివిధ సమయాల్లో ఏజ్ గ్రూప్ టోర్నీల్లో మోసాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. ఏజ్‌ విషయంలో మోసానికి పాల్పడినందుకు పలువురు క్రికెటర్లు నిషేధానికి గురయ్యారు.

BCCI: ఆ విషయంలో ఆటగాళ్లకు భారీ షాక్.. సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో చెక్ పెట్టనున్న బీసీసీఐ.. అదేంటంటే?
Bcci
Follow us
Venkata Chari

|

Updated on: Jul 23, 2022 | 8:15 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆటగాళ్ల కచ్చితమైన వయసు నిర్ధారణ కోసం ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీంతో తక్షణ ఫలితాలు, 80 శాతం వరకు ఖర్చు ఆదా చేసే లక్ష్యంతో ప్రయోగాత్మక ప్రాతిపదికన ‘TW3’ పద్ధతిని ఎంచుకుంది. ప్రస్తుతం, ఏజ్‌లలో జరిగే మోసాల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్న బీసీసీఐ.. వయస్సు నిర్ధారణ కోసం ‘TW3’ పద్ధతిని (ఎడమ చేయి, మణికట్టు ఎక్స్-రేల ఆధారంగా) ఉపయోగిస్తుంది. ప్రస్తుత పద్ధతిలో ఒక్కరికి టెస్ట్ చేయాలంటే ధర రూ. 2400గా ఉంది. అలాగే ఫలితాలను పొందడానికి మూడు నుంచి నాలుగు రోజుల వరకు వేచి చూడాల్సి వచ్చేది. అయితే ‘BoneXpert సాఫ్ట్‌వేర్’ తక్షణ ఫలితాలను అందిస్తుంది. ఖర్చు కూడా కేవలం రూ. 288 మాత్రమేనని తేలింది.

ఈమేరకు బీసీసీఐ నోట్‌లో, “వయస్సును ధృవీకరించడానికి బీసీసీఐ పరిశీలకుడి సమక్షంలో ఆటగాళ్ల మణికట్టు ఎక్స్-రేలను అందజేస్తుంది. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ X-రే కాపీని BCCI AVPకి పంపిస్తుంది. దీంతో సదరు ప్లేయర్ పాస్‌ను అందుకుంటాడు’ అని తెలిపింది.

“BCCI AVP దాని ప్యానెల్ నుంచి ఇద్దరు స్వతంత్ర రేడియాలజిస్ట్‌లకు పంపుతుంది. రేడియాలజిస్ట్ అంచనా వేసి నివేదికను BCCIకి సమర్పిస్తారు. మొత్తం ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. 38 రాష్ట్ర సంఘాల ఆటగాళ్లను పర్యవేక్షించడానికి, BCCIకి నలుగురు రేడియాలజిస్ట్‌లు ఉన్నారు” అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

దీని ప్రకారం, “బోర్డు ఈ ప్రయోగంపై రాష్ట్ర సంఘాలతో కలిసి పని చేస్తుంది. దాని డేటాబ్యాంక్‌లో పరిమిత సంఖ్యలో ఎక్స్-రే ట్రయల్ డేటా నడుస్తున్నందున బోర్డు సంతృప్తి చెందినప్పటికీ, అన్ని సమాఖ్యలతో కలిసి పెద్ద సంఖ్యలో పని చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది”.

బీసీసీఐ ఆధ్వర్యంలోని టోర్నీల్లో వివిధ సమయాల్లో ఏజ్ గ్రూప్ టోర్నీల్లో మోసాలకు పాల్పడిన కేసులు వెలుగు చూశాయి. ఈమేరకు ఇలాంటి మోసాలను నివారించేందుకు బీసీసీఐ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. జూన్ 2019లో, జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ రసిఖ్ ఆలం తప్పుడు జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాడు. దీంతో దోషిగా తేలడంతో రెండేళ్లపాటు నిషేధానికి గురయ్యాడు.

గతంలో అండర్-19 ప్రపంచకప్ స్టార్ మంజోత్ కల్రా, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ బ్యాట్స్‌మెన్ అంకిత్ బవానేలు తమ వయస్సును దాచిపెట్టినందుకు దోషులుగా తేలారు. ఆగస్టు 2020లో, BCCI తన నమోదిత ఆటగాళ్లకు సరైన వయస్సును అందించడానికి స్వచ్ఛంద పథకాన్ని ప్రారంభించింది. వయసుపై మోసం చేసే క్రికెటర్లపై రెండేళ్లపాటు నిషేధం విధించాలని బీసీసీఐలో నిబంధన ఉంది.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..