- Telugu News Photo Gallery Cricket photos Team india former captain virat kohli earning from on instagram post cristiano ronaldo lionel messi telugu sports news
Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌తో కోహ్లీ సంపాదన తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?
ఇటీవలి నివేదిక ప్రకారం విరాట్ కోహ్లి ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఆటగాడిగా నిలిచాడు.
Updated on: Jul 22, 2022 | 3:32 PM

విరాట్ కోహ్లి తన కెరీర్‌లో అత్యంత పేవలమైన ఫాంలో ఉన్నాడు. అతని బ్యాటింగ్‌పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అయితే, డబ్బు సంపాదన విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ దూసుకపోతున్నాడు. ఇటీవలి నివేదిక ప్రకారం విరాట్ కోహ్లి ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఆటగాడిగా నిలిచాడు.

Hopperhq.com నివేదిక ప్రకారం, విరాట్ కోహ్లీ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం రూ. 8.69 కోట్లు తీసుకుంటున్నాడు. ఏ ఆసియా ఆటగాడు లేదా సెలబ్రిటీ కూడా విరాట్ కంటే ముందులేకపోవడం గమనార్హం. విరాట్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ కంటే ముందు అర్జెంటీనా గ్రేట్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ నిలిచాడు. ఈ లెజెండరీ ప్లేయర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం రూ.14 కోట్లు వసూలు చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ కంటే మెస్సీ ఒక పోస్ట్ సంపాదన ఐదున్నర కోట్లు ఎక్కువ అందుకుంటున్నాడు.

పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానోరొనాల్డో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్నాడు. రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం రూ. 19 కోట్లు అందుకున్నాడు. అంటే విరాట్ కోహ్లి కంటే రొనాల్డో రెండింతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు.

క్రిస్టియానో రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కూడా కలిగి ఉన్నాడు. రొనాల్డోను 53 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. 34 కోట్ల మందికి పైగా మెస్సీని అనుసరిస్తున్నారు. అదే సమయంలో, విరాట్ 200 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ప్రపంచంలో 17వ స్థానంలో ఉన్నాడు.




