AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: మన దగ్గర బేరాల్లేవమ్మా.. కేంద్ర మంత్రితో మక్క కంకులమ్మే కుర్రాడి మాటలు వైరల్‌..

Faggan Singh Kulaste: రోడ్డు పక్కన విక్రయాలు సాగించే వారిలో చాలామంది పేదవారే ఉంటారు. వారు పొట్టకూటి కోసం రేయింబవళ్లు ఎండనక, వాననక రోడ్డు పక్కనే ఉంటూ తమ ఆహార ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తుంటారు. అందుకే వారితో ఎవ్వరూ ఎక్కువగా బేరమాడరు. వారు అడిగిన డబ్బులు ఇచ్చి వెళుతుంటారు. అయితే..

Viral video: మన దగ్గర బేరాల్లేవమ్మా.. కేంద్ర మంత్రితో మక్క కంకులమ్మే కుర్రాడి మాటలు వైరల్‌..
Basha Shek
|

Updated on: Jul 23, 2022 | 10:37 AM

Share

Faggan Singh Kulaste: రోడ్డు పక్కన విక్రయాలు సాగించే వారిలో చాలామంది పేదవారే ఉంటారు. వారు పొట్టకూటి కోసం రేయింబవళ్లు ఎండనక, వాననక రోడ్డు పక్కనే ఉంటూ తమ ఆహార ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తుంటారు. అందుకే వారితో ఎవ్వరూ ఎక్కువగా బేరమాడరు. వారు అడిగిన డబ్బులు ఇచ్చి వెళుతుంటారు. అయితే కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ప్రముఖ బీజేపీ నాయకుడు ఫగన్‌ సింగ్‌ కులస్తే రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులమ్మే కుర్రాడితో బేరామాడుతూ కనిపించారు. దీంతో నెటిజన్లు కేంద్రమంత్రిపై మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..ఫగన్‌సింగ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఓ కుర్రాడు మొక్కజొన్న కంకులు కాలుస్తుండడం గమనించారు. ఆయనే స్వయంగా కారులో దిగి వచ్చి మూడు కంకులు అడిగి కాల్పించుకున్నారు. కుర్రాడు కూడా చక్కగా కంకులు కాల్చి నిమ్మరసం.. ఉప్పు, కారం రాసి కేంద్ర మంత్రికి ఇచ్చాడు. అయితే ఆ తర్వాత మంత్రి బేరమాడడం మొదలుపెట్టారు.

మీ కారు చూసి చెప్పలేదు..

ఇవి కూడా చదవండి

మొదట ఒక్క కంకి ఎంత? అని కేంద్ర మంత్రి అడగ్గా.. రూ.15 అని కుర్రాడు జవాబిస్తాడు. దీంతో ఆశ్చర్యపోయిన మంత్రి ‘ఒక్కోటి రూ.15.. అంటే మొత్తం మూడు కంకుల‌కు రూ.45 ఇవ్వాలా?’ అని అడుగుతారు. దీనికి బదులుగా ఆ కుర్రాడు.. ‘ ఆ కండి స్టాండర్డ్‌ రేట్‌ రూ.15 సార్‌.. మీకు కారు ఉందని నేను ఆధర చెప్పలేదు’ అంటూ అదిరిపోయే పంచ్‌ ఇస్తాడు. చివరకు కులస్తే ఆ కుర్రాడు అడిగినంత డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కాగా కేంద్రమంత్రి స్వయంగా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు. ‘ఈరోజు సియోని నుంచి మాండ్లాకు వెళుతున్నాను. స్థానిక మక్కకంకులను రుచి చూశాను. మనమందరం స్థానిక రైతులు, దుకాణదారుల నుంచి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఇది వారికి ఉపాధిని ఇస్తుంది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే కేంద్రమంత్రి అయ్యి ఉండి ఓ రోడ్డు పక్కన కుర్రాడితో బేరాలాడడం అసలేమీ బాగోలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..