Actions on God: వరుణదేవుడిపై చర్యలకు రైతు ఫిర్యాదు.. నెట్టింట వైరల్ అవుతున్న ఫిర్యాదు లేఖ..
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండగా..
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండగా.. యూపీలో మాత్రం సీన్ మరో రకంగా ఉంది. వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. పశువులకు సైతం గ్రాసం లేక అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ రైతుకు కోపం వచ్చింది. సాధారణంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, తమ పంటలు బాగా పండాలని రైతులు ఇంద్రుడిని ఆరాధిస్తారు. కానీ ఇక్కడ ఓ రైతుకు ఆ ఇంద్రదేవుడిపై తీవ్ర ఆగ్రహం కలిగింది. దాంతో అతనిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైతు ఫిర్యాదు మేరకు ఇంద్ర భగవాన్‌పై తదుపరి చర్యలకు సీనియర్ రెవెన్యూ అధికారి సిఫార్సు చేయడం చర్చనీయాంశంగా మారింది.గోండ్ జిల్లాలోని జాలా గ్రామానికి చెందిన సుమిత్ కుమార్ యాదవ్ ఓ సన్నకారు రైతు. జూలై 16న స్థానిక రెవెన్యూ అధికారులకు ఓ విచిత్రమైన ఫిర్యాదు చేశాడు. అతను తమ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని దీనికి బాధ్యుడైన ఇంద్ర భగవాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మెజిస్ట్రేట్‌ను కోరుతూ సదరు రైతు తహసీల్దారుకు ఈ ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ లేఖను అందుకున్న రెవెన్యూ అధికారి అందులో ఏమి రాసుందో చదవకుండానే తదుపరి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ డిప్యూటీ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు లేఖను పంపించారు. ఈ ఫిర్యాదు లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అలాంటి లేఖ ఏదీ తాను అధికారులకు ఫార్వార్డ్ చేయలేదని రెవెన్యూ అధికారి వర్మ తెలిపారు. అందులోని సీల్, తన సంతకం రెండూ నకిలీవిగా చెప్పుకొచ్చారు. దీన్ని ఎవరు తయారుచేశారో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..