Viral Video: తల్లిదండ్రులపై ప్రేమ ఆకాశమంత.. కుమారుడు చేసిన పనికి సలాం కొట్టాల్సిందే.. వీడియో
ఓ యువకుడు తన తల్లిదండ్రుల ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లి వారిని ఆనందాశ్చర్యంలో ముంచెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Pilot flies parents surprise video: తల్లిదండ్రులు తమ బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. అందుకు ఎంత కష్టమైనా సరే కాదనకుండా చేస్తారు. వారు ప్రయోజకులుగా మారిన తర్వాత ఆనందంతో ఉప్పొంగిపోతారు. అలానే.. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత కొడుకు, కూతుళ్లపై ఉంటుంది. ఆ క్షణం కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. దీనికనుగుణంగా ఓ యువకుడు తన తల్లిదండ్రుల ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లి వారిని ఆనందాశ్చర్యంలో ముంచెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు అమేజింగ్ అంటూ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో తాజాగా ఓ భారతీయ పైలట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.
వైరల్ అవుతున్న వీడియోలో పైలట్ కమల్ కుమార్.. తన తల్లిదండ్రులను జైపూర్‌కు విమానంలో తీసుకెళ్లాడు. అయితే.. తమ కొడుకు విమానం నడుపుతున్నాడని తెలియని పైలట్ తల్లిదండ్రులు.. విమానం లోపల పైలట్ యూనిఫాంలో ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోతూ సంబరపడ్డారు. ఈ వీడియోను విమానంలో ఉన్న సిబ్బంది చిత్రీకరించారు. దీన్ని చూసి అందరూ పైలట్‌ను అభినందిస్తున్నారు. జీవితంలో తల్లిదండ్రులకు ఇంతకన్నా ఇంకేం ఆనందం ఉటుందంటూ పేర్కొంటున్నారు. వీడియోను పంచుకున్న కమల్.. క్యాప్షన్ ఇస్తూ ‘‘నేను ఎగరడం ప్రారంభించినప్పటి నుంచి నేను దీని కోసం ఎదురు చూస్తున్నాను.. చివరకు జైపూర్‌కు అమ్మనాన్నను ఇంటికి తీసుకెళ్లే అవకాశం లభించింది.’’ అంటూ రాశాడు.
వీడియో చూడండి..
View this post on Instagram
ఇన్‌స్టాగ్రామ్‌లో @desipilot11 అనే యూజర్‌నేమ్‌తో పైలట్ కమల్ కుమార్ షేర్ చేయగా.. దీన్ని 2.7 మిలియన్ల మంది వీక్షించారు. దీంతోపాటు 1 లక్షా 13 వేలకు పైగా యూజర్లు లైక్ చేశారు. దీంతోపాటు అమెజింగ్ అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..