Urine Infection: మూత్రం ఆ రంగులో వస్తుందా..? అయితే.. వెంటనే జాగ్రత్త పడండి.. ఎందుకంటే..
ఆరోగ్యకరమైన వ్యక్తి మూత్రం పసుపు రంగులో ఉంటే మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయని గ్రహించవచ్చు. అయితే.. మూత్రం స్పష్టంగా తెల్లగా ఉంటే..
Clear Urine Problem: మూత్రం రంగును బట్టి శరీర సమస్యలను గుర్తించవచ్చు. సాధారణంగా మూత్రం రంగు అస్పష్టంగా ఉంటే పూర్తిగా హైడ్రేట్ అయ్యారని అర్ధం. కానీ మూత్రం రంగు క్లియర్ (తెల్లగా) గా ఉంటే ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి మూత్రం (Urinary tract infection) పసుపు రంగులో ఉంటే మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయని గ్రహించవచ్చు. అయితే.. మూత్రం స్పష్టంగా తెల్లగా ఉంటే.. అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని తీసుకుంటున్నారని అర్థం. ఇది శరీరానికి అవసరం లేదని.. దీని గురించి జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
యూరిన్ క్లియర్ అంటే ఏమిటి?
మూత్రం పసుపు రంగులో ఉండకపోయినా.. నీటిలా చాలా స్పష్టంగా ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటే ప్రమాదకరం. ఇలా తరచూ జరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించి అతని సలహాను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
యూరిన్ క్లియర్‌కు కారణాలు ఏమిటి?
డయాబెటిస్‌లో ఈ సమస్య వస్తుంది: మధుమేహంతో బాధపడుతున్న బాధితులు స్పష్టమైన మూత్రాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి సక్రమంగా లేకపోవడం వల్ల ఇలా తరుచూ జరుగుతుంది. ఈ పరిస్థితిలో శరీరం నుంచి అదనపు చక్కెరను తొలగించడానికి శరీరం పనిచేస్తుంది. ఈ సందర్భంలో మూత్రం సాధారణం కంటే ఎక్కువగా క్లియర్‌గా బయటకు వెళుతుంది.
మూత్రపిండ వ్యాధులు: కిడ్నీ వ్యాధి ఉన్నా మూత్రం క్లియర్‌గా ఉండవచ్చు. మూత్రం స్పష్టంగా ఉందని మీరు గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఎక్కువ నీరు తాగుట: అవసరానికి మించి నీళ్లు తాగినా మూత్రం క్లియర్ గా ఉంటుంది. శరీరంలో సోడియం స్థాయిని తగ్గిస్తుంది. కావున ఎక్కువ నీరు తాగినా కూడా ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..